మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా శుభాకాంక్షలతో సోషల్ మీడియా మొత్తం మారుమ్రోగిపోతుంది. అభిమానులు భారీ స్థాయిలో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు చేస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఈ వేడుకల మధ్య, మెగాస్టార్ తమ్ముడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పంపిన స్పెషల్ విషెస్ ప్రత్యేకంగా నిలిచాయి. పవన్ తన సహజమైన హృదయానికి హత్తుకునే స్టైల్‌లో అన్నయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు. ఇక దానికి ప్రతిస్పందనగా చిరంజీవి తనదైన శైలిలో ఎమెషనల్ రిప్లై ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..
“జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు! తమ్ముడు కల్యాణ్.. ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో, ఓ తమ్ముడిగా నీ విజయాలను చూసి నేను అంతే గర్విస్తున్నాను. నీ పట్టుదల, కార్యదీక్ష చూసి ప్రతీ క్షణం ఆనందిస్తాను. నిన్ను నమ్మినవాళ్ల కోసం నువ్వు చేసే పోరాటం నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తినిస్తుంది. నేడు నీ వెనుక కోట్లాదిమంది జనసైనికులు ఉన్నారు. వారిని ఓ నాయకుడిలా నడిపించు. అభిమానుల ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వాదాలు నీతో ఉంటాయి. నీ ప్రతి అడుగులో విజయం నీ సొంతం కావాలి” అని తెలిపారు. కాగా ఈ ఎమోషనల్ రిప్లై చూసిన మెగా అభిమానులు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. చాలామంది ‘ఇదే మెగా బాండ్’, ‘ఇద్దరి మధ్య లవ్ అన్‌మ్యాచబుల్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు!
తమ్ముడు కల్యాణ్…
ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా… pic.twitter.com/UMN5vu3nqZ
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 22, 2025