NTV Telugu Site icon

Chiranjeevi Wife: పుట్టిన రోజున ఫుడ్ బిజినెస్‌లోకి చిరంజీవి సతీమణి సురేఖ.. కొణిదెల వారి రుచులు పొందాలంటే?

Attammas Kitchen

Attammas Kitchen

Chiranjeevi Wife Surekha Konidela proudly announces the launch of Athamma’s Kitchen: అల్లు రామలింగయ్య కుమార్తె, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ తన పుట్టినరోజు నాడు కొత్త ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టినట్లు ప్రకటన వెలువడింది. నిజానికి ఆమె కొత్త బిజినెస్ లోకి దిగుతున్నారు అనే ప్రచారం కొద్దిరోజుల నుంచి జరుగుతోంది. ఇప్పటివరకు హౌస్ వైఫ్ గా ఉన్న ఆమె ఒకవేళ నిర్మాతగా వ్యవహరిస్తారు అనే ప్రచారం జరిగింది కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె ఫుడ్ బిజినెస్ ప్రారంభించినట్లు ఆమె కోడలు ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎక్కడ ఉన్నామనే విషయం పక్కన పెడితే సౌత్ ఇండియన్ ఫుడ్ మిస్ అవ్వకుండా చేసేలా ఈ అత్తమ్మాస్ కిచెన్ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. అంతే కాదు ప్రస్తుతానికి నాలుగు ప్రొడక్ట్స్ అమ్మకానికి కూడా పెట్టారు. అందుకుగాను ఒక వెబ్సైట్ (https://athammaskitchen.com/) కూడా అందుబాటులో తీసుకొచ్చారు.

Vijay Deverakonda: అప్పటి వరకు చదవనన్న లేడీ ఫ్యాన్.. క్యూట్ షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

ప్రస్తుతానికి ఉప్మా మిక్స్, పులిహోర పేస్ట్, పొంగల్ మిక్స్, రసం పౌడర్ నాలుగింటిని అమ్ముతున్నారు. ఈ నాలుగు కలిపి కొనాలనుకునే వారికి 1100 రూపాయలు ఛార్జ్ విధిస్తున్నారు. తన అత్తమ్మ పుట్టినరోజు నాడే ఈ కొత్త వెంచర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఉపాసన వెల్లడించారు. ముఖ్యంగా సొంత ఇంట్లో లేని వారు అంటే బ్యాచిలర్స్ లేదా సొంత ప్రాంతానికి దూరంగా ఉంటున్న వారు వీలైనంత త్వరగా సౌత్ ఇండియన్ డిషెస్ తయారు చేసుకునేందుకు ఈ వెంచర్ స్టార్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇండియాలో మాత్రమే ఈ బిజినెస్ మొదలుపెట్టినా త్వరలోనే విదేశాల్లో ఉన్న తెలుగు వారు సౌత్ ఇండియన్ పీపుల్ కి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం కొణిదెల వారి ఇంటి రుచులు చూడాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకొని వంట చేసుకుని తినండి మరి.

Show comments