టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే.. స్టార్ హీరోల సినిమాలలో అమ్మడు బంపర్ ఆఫర్లను పట్టేసి విజయాలను అందుకొని .. ఒకానొక దశలో అనసూయ ఉంటే సినిమా హిట్ అనే టాక్ తెచ్చుకుంది. ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవినే అనసూయ బెదిరించిందట.. దానికి కోపం తట్టుకోలేని చిరు .. ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. చిరుని బెదిరించేటంత ఉందా అనసూయకు.. అసలేం జరిగింది అని నెటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే అందరు అనుకున్నట్లు ఇది రియల్ కాదని.. రీల్ అని తెలిసి శాంతించారు.
అస్సలు విషయమేంటంటే.. ప్రస్తుతం చిరు నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక తాజా షెడ్యూల్ లో అనసూయ- చిరు కాంబోలో కొన్ని కీలక సన్నివేశాలను డైరెక్టర్ చిత్రీకరించారట. ఇక ఈ సినిమాలోఅనసూయ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నదట. మొదటి నుంచి చిరుకు సపోర్ట్ చేసినట్లే చేసి మధ్యలో అతడికి ఎదురు తిరిగి .. చివరికి చిరు జైలుకు వెళ్లేలా చేస్తుందట. అక్కడే చిరు అనసూయకు వార్నింగ్ ఇస్తాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అనసూయకు మరో హిట్ దక్కుతుందేమో చూడాలి.