Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. బింబిసార సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మొట్ట మొదటిసారి యూవీ క్రియేషన్స్ చిరు సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలువినిపిస్తున్నాయి. ముల్లోకాల వీరుడుగా చిరు ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారని సమాచారం. ఇప్పటికే త్రిష ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఇక తాజాగా ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ కూడా విశ్వంభరలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుందని టాక్ నడుస్తోంది. సీతారామం చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. సీతగా టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో కొలువైపోయింది.
Yash: యష్ సినిమాలో సాయి పల్లవి.. డైరెక్టర్ ఎవరంటే?
కథానుసారం విశ్వంభర చిత్రంలో చిరు.. మూడు లోకాలను తిరిగే వీరుడుగా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో మృణాల్, త్రిష దేవకన్యలుగా కనిపించనున్నారని తెలుస్తోంది. కథ ఇలా ఉంటుంది కాబట్టే.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను పోలి ఎలాంటి సీన్స్ తీయడానికి వీల్లేదని వైజయంతీ మూవీస్ ఆల్రెడీ చెప్పుకొచ్చారు. అయితే .. వశిష్ఠ మాత్రం అలానే సీన్స్ తీస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో మృణాల్.. దేవకన్యగా కనిపించబోతుంది అంట. అతిలోక సుందరి శ్రీదేవిలా ఆమె లుక్ ఉండబోతుందని టాక్ నడుస్తోంది. వీరితో పాటు మరో ముగ్గురు హీరోయిన్లను వెతికే పనిలో పడ్డారట చిత్ర బృందం. అతిలోక సుందరి అంటే శ్రీదేవి.. మరి ఆమెలా మృణాల్ ఉండబోతుందా.. ? అంతకు మించి ఉండబోతుందా.. ? అనేది తెలియాల్సి ఉంది.