Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రోజురోజుకూ యంగ్ అయిపోతున్నారు. అసలు వయసుతో సంబంధమే లేకుండా యంగ్ లుక్ లో మెరిసిపోతున్నారు. ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీగా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. బింబిసార దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆసక్తి రేపింది. సైలెంగ్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా చిరంజీవి లుక్ బయటకు రిలీజ్ చేశారు. ఇందులో ఎలాంటి డీటేయిల్స్ లేకపోయినా.. చిరు ఫొటోలు రిలీజ్ చేశారు.
Read Also: KCR: రేపు అసెంబ్లీకి వెళ్లి కేసీఆర్ మా సమస్యలపై మాట్లాడకపోతే.. ఫామ్‌హౌస్ ముట్టడిస్తాం..!
ఇందులో చిరంజీవి వింటేజ్ లుక్ లో మెరిసిపోతున్నారు. చాలా యంగ్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ తెగ షేరింగ్ చేసేస్తున్నారు. వింటేజ్ లుక్ లో మెగాస్టార్ అదిరిపోయారంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.