NTV Telugu Site icon

Chiranjeevi: మోదీకి ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి

February 7 (41)

February 7 (41)

తాజాగా భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేవ్స్ అడ్వైజరీ బోర్డ్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ ప్రముఖులు, నిపుణులు పాల్గొన్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5 నుండి 9 వరకు వేవ్స్ 2025 నిర్వహించనున్నారు. వినోదం, సృజనాత్మకత, సంస్కృతిని ప్రోత్సహించేందుకు “క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ – సీజన్ 1” ప్రారంభించనున్నారు. నవంబర్‌లో గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇది ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ వర్చువల్ సమావేశంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, చిరంజీవి, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్ వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే, ముఖేష్ అంబానీ, సత్య నాదెళ్ల, ఆనంద్ మహీంద్రా వంటి వ్యాపార ప్రముఖులతో ప్రధాని చర్చించారు.

Also Read:Sri Leela: బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో బోల్డ్ పాత్రలో శ్రీలీల..

అయితే తాజాగా ఇందులో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి పోస్ట్ పెట్టారు. మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న వీడియోను పంచుకుంటూ.. అడ్వైజరీ బోర్డ్ లో భాగం కావడం ఆనందంగా ఉంది. మోదీకి ధన్యవాదాలు . వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్(వేవ్స్) కోసం అడ్వైజరీ బోర్డ్లో భాగం కావడం ఇతర సభ్యులతో కలిసి నా ఆలోచనలను పంచుకోవటం నిజంగా సంతోషంగా ఉంది. మోదీ ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు” అని చిరంజీవి పేర్కొన్నారు.