Site icon NTV Telugu

Vishwambhara : విశ్వంభరపై చిరంజీవి ట్వీట్.. రేపు భారీ అప్డేట్

Vishwambara

Vishwambara

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ సినిమా నుంచి అప్పట్లో పాటలు వచ్చాయి. కానీ అంతకు మించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా మూవీ నుంచి అప్డేట్ గురించి తాజాగా చిరంజీవి ట్వీట్ చేశారు. ఆగస్టు 21 అంటే రేపు గురువారం ఉదయం 09:09 గంటలకు ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటుందని తెలిపారు. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే ఉంది. కాబట్టి పుట్టిన రోజు సందర్భంగా మూవీ గురించి ఇంపార్టెంట్ అప్డేట్ రాబోతోంది.

Read Also : Nagarjuna : నాగార్జునకు ఫిదా అయిన తమిళ తంబీలు.. ఎందుకంటే..?

చూస్తుంటే రేపు ఫ్రెష్ పోస్టర్ లో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ సెప్టెంబర్ లో భారీగా సినిమాలు పోటీకి రెడీ అవుతున్నాయి. ఓజీ, అఖండ-2 ఉండటంతో పాటు చిన్న సినిమాలు ముందే రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి సెప్టెంబర్ లో వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. అక్టోబర్ లో లేదా నవంబర్ కు మూవీని షిఫ్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేసేసింది మూవీ టీమ్.

Read Also : JR NTR : ఎన్టీఆర్ పెద్దమనసు.. అతన్ని ఆదుకుంటున్నాడా..?

Exit mobile version