Site icon NTV Telugu

Acharya: ‘సిద్ధ’గా పవన్ కళ్యాణ్.. చిరు ఏమన్నారంటే..?

Pawan

Pawan

“ఆచార్య సినిమాలో సిద్ధగా చరణ్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో పవన్ కళ్యాణ్ చేసినా అంతే ఆనందపడేవాడిని” అని చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరంజీవి, చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య చిత్రం ఏప్రిల్ 29 న రిలీజ్ కానున్న విషయం విదితమే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నేడు  ఆచార్య టీమ్ .. మీడియాతో సమావేశం అయిన విషయం విదితమే. ఇక ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ గురించి చిరు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

” సిద్ద పాత్రలో పవన్ కళ్యాణ్ ఉంటే బావుండు అని ఎప్పుడైనా అనిపించిందా..?” అని రిపోర్టర్ అడిగిన ప్రశాంకు చిరు సమాధానమిస్తూ” చరణ్ ఒప్పుకోకపోతే, కుదరకపోతే వేరే యాక్టర్స్ ఎవ్వరైనా న్యాయం చేస్తారు.. కానీ చరణ్ చేస్తే ఆ ఫీల్ వేరు ఉంటుంది. రియల్ గా ఉన్నటువంటి తండ్రి గుణం యాడ్ అవుతుంది అనే ఉద్దేశ్యంతోటే చరణ్ ను తీసుకోవడం జరిగింది. అయితే ఆ పాత్రకు చరణ్ కూడా దొరకకపోతే.. ది బెస్ట్ ఆల్ట్రనేట్,  ఆ ఖాళీని పూరించేది, అదే ఫీల్ నాకిచ్చేది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే.. పవన్ కళ్యాణ్ అదే స్థానంలో ఉంటే నాకు వంద శాతం అదే ఫీల్ ఉంటుంది.. కానీ అంతవరకు ఛాన్స్ తీసుకోలేదు.. అన్ని కుదిరిపోయాయి అలాగా” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వైకాయ్లు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version