“పొట్టకూటి కోసం పొట్ట మాడ్చుకున్నాను” అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన హీరోగా నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో, సినిమా టీం ఒక ఇంటర్వ్యూ చేసింది. అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సహా నిర్మాతలు సాహు, సుస్మిత.. ఈ ఐదుగురు ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Also Read :Anil Sunkara: సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు బాగున్నాయి..మా సినిమా మరీ బాగుంది!
అయితే ఒకానొక సందర్భంలో, మెగాస్టార్ చిరంజీవి తన చేతులతో వండిన కొన్ని పదార్థాలను వెంకటేష్ సహా మిగిలిన వారికి వడ్డించారు. వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవిని కూడా తినాలని కోరగా, ఆయన వారించారు. దీంతో “డైట్ చేస్తున్నావు, సన్నగా అయిపోయి సినిమాలో నన్ను డామినేట్ చేశావు” అంటూ వెంకటేష్ సరదాగా కామెంట్ చేశారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. “పొట్టకూటి కోసం పొట్ట మాడ్చుకున్నాను” అని, అందుకే తాను సన్నగా అయ్యానంటూ వ్యాఖ్యానించారు.
Also Read :Trivikram Srinivas: తండ్రిని కాదని ఆ డైరెక్టర్ వద్ద చేరిన త్రివిక్రమ్ కొడుకు..
అంతేకాక, “కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని, అందరికీ అన్ని తినే అదృష్టం ఉండదు” అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమాని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు. జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, పాజిటివ్ మౌత్ టాక్‌తో సూపర్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఒకరకంగా చెప్పాలంటే.. గంటకు 30 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయంటే, ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
