Site icon NTV Telugu

Anil Ravipudi : బ్లాక్ బస్టరిచ్చిన రావిపూడికి మెగాస్టార్ కళ్ళు చెదిరే ఆఫర్!

Anil Ravipudi Mega Bonus

Anil Ravipudi Mega Bonus

టాలీవుడ్‌లో ప్రస్తుతం ‘మెగా’ హవా నడుస్తోంది, సంక్రాంతి బరిలో నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ, విమర్శకుల ప్రశంసలతో దూసుకుపోతోంది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో వినోదాన్ని పంచి, బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ‘బ్లాక్ బస్టర్’ను తన ఖాతాలో వేసుకున్నారు, ఈ హిట్ తో మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోతుండగా, తాజాగా చిత్ర యూనిట్ ఒక క్రేజీ ఇంటర్వ్యూను విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది, ఈ సందర్భంగా చిరంజీవి ఒక సంచలన ప్రకటన చేశారు. టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడికి ఆయన ఒక ‘మెగా ఆఫర్’ ఇచ్చారు.

Also Read: Peddi vs Paradise : ‘పెద్ది’, ‘ది పారడైజ్’ సప్పుడు లేదేంటి? రిలీజ్ ఉన్నట్టా, లేనట్టా?

“అనిల్.. నాకు, వెంకటేష్‌కి కలిపి ఒక మంచి స్క్రిప్ట్ సిద్ధం చెయ్, మేమిద్దరం కలిసి సినిమా చేయడానికి సిద్ధం” అని చిరంజీవి ప్రకటించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఒకవేళ వెంకటేష్ సినిమాలో తనకు గెస్ట్ రోల్ ఇచ్చినా సరే, నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చిరంజీవి పెద్ద మనసుతో చెప్పారు, ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉన్న ఫుల్ లెంగ్త్ కథను రాసుకురమ్మని అనిల్‌కు సూచించారు. సినిమా ఎప్పుడు చేద్దామన్నా తాను సిద్ధమేనని, వెంటనే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టమని అనిల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవి ఆఫర్‌పై విక్టరీ వెంకటేష్ కూడా ఎంతో ఉత్సాహం చూపించారు, “ఖచ్చితంగా చేద్దాం” అంటూ ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఈ పరిణామాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ‘మెగా బోనస్’ గా అభివర్ణించారు. ఇప్పటికే ‘మన శంకర వరప్రసాద్ గారు’ హిట్ ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న అనిల్, ఈ ఇద్దరు దిగ్గజ హీరోల కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తారో అని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.

Exit mobile version