NTV Telugu Site icon

Chiranjeevi: బిగ్ బ్రేకింగ్.. చిరును కలిసిన గంటా శ్రీనివాస్.. ఎందుకు..?

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చేయరు లీక్స్ ద్వారా ఒక సంగీత్ సాంగ్ ను ఈ మధ్యనే ఫినిష్ చేసినట్లు తెలిసింది. మిగతా భాగాన్ని హైదరాబాద్ లోనే పూర్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే భోళా శంకర్ సెట్ లో టీడీపీ నేతలు గంటా శ్రీనివాస్, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ మీట్ అయ్యారు. చిరుకు పుష్పగుచ్చం ఇచ్చి పలరించారు. అయితే ఎందుకు కలిశారు అనేది తెలియాల్సి ఉంది. ఇక చిరుకు గంటా శ్రీనివాస్ మంచి స్నేహితుడు అన్న విషయం అందరికి తెల్సిందే. ఇక స్నేహితుడును చూడగానే చిరు ఆయనను ఆలింగనం చేసుకొని మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Raviteja73: ప్రతి ధ్వని, ప్రకంపనం అంటున్నారు.. మా రవన్నను ఏం చేస్తున్నారు బ్రో

ఇక వీరు ముగ్గురు కొద్దిసేపు ముచ్చటించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలను చిరు షేర్ చేయలేదు. దీంతో వీరు ఎందుకు కలిశారు అనేది మిస్టరీగా మారింది ఈ ఫోటోలు చూసిన అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఎందుకు భేటీ అయ్యారు..? అని కొందరు.. వారాహి యాత్ర గురించి మాట్లాడడానికా..? ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏ ఈఫోటోల్లో చిరు .. భోళా శంకర్ లుక్ లోనే కనిపించాడు. మరి వీరి కలయిక కు కారణం ఏంటి అనేది చిరు చేటాడేమో చూడాలి.

Show comments