Site icon NTV Telugu

Bhavadeeyudu Bhagat Singh : మెగా లీక్… పవర్ ఫుల్ డైలాగ్ !

Chiranjeevi

Chiranjeevi

మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ప్రస్తుతం “ఆచార్య” సినిమా ప్రమోషన్లలో టీం తలమునకలై ఉన్నారు. అందులో భాగంగా కొరటాల, చిరంజీవి, రామ్ చరణ్, పూజాహెగ్డే వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇక తాజాగా ‘ఆచార్య’ టీంతో దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి చేసిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో తాజాగా విడుదలైంది. ఈ వీడియోలో చెర్రీ, చిరు, కొరటాల పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అందులో భాగంగానే హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న “భవదీయుడు భగత్ సింగ్” సినిమాలో నుంచి డైలాగ్ ను లీక్ చేయించారు చిరంజీవి.

Read Also : Kiara Advani : హీరోతో బ్రేకప్ పై ఇన్ డైరెక్ట్ క్వశ్చన్… హీరోయిన్ ఎపిక్ రిప్లై

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. దర్శకుడు హరీష్ శంకర్ సినిమాలోని ఒక మెగా డైలాగ్ ను మామూలుగా వివరించగా, చిరంజీవి చాలా ఇంటెన్సిటీతో చెప్పారు. “మొన్న వీడు మన ఇంటికి వచ్చి అరిస్తే… ఏంటి వీడి ధైర్యం అనుకున్నా. ఇప్పుడు అర్దమైంది… వీడు నడిస్తే వీడి వెనుక లక్ష మంది నడుస్తారు. ఇదే వీడి ధైర్యం అనుకుంటా’’ అని విలన్ అనగా, పక్కనే ఉన్న మరో వ్యక్తి “కాదు… ఆ లక్షలాది మందికి వీడు ముందున్నాడు అనే ధైర్యం” అని చెప్తాడు అంటూ చిరు రిక్వెస్ట్ మేరకు హరీష్ శంకర్ డైలాగ్ ను లీక్ చేసేశారు. దీంతో ఈ డైలాగ్ చాలా పవర్ ఫుల్ గా ఉందంటూ మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version