Site icon NTV Telugu

Chiranjeevi : చిరంజీవికి స‌ర్జ‌రీ?

Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి త్వరలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఆయన మోకాలికి ఇటీవల సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆయన కొంతకాలంగా మోకాలు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలోనే సరిగా నడవలేకపోతున్నారని సమాచారం. అయినా సరే పండుగకు సినిమా రిలీజ్ చేయాలి కాబట్టి, సినిమా షూటింగ్ అంతా బాధ ఓర్చుకొని మరి పూర్తి చేశారని, తాజాగా సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది.

Also Read: Pawan Kalyan : పవన్ ‘కటానా’ గర్జన: మార్షల్ ఆర్ట్స్ విధ్వంసం.. పోస్టర్ వెనుక రహస్యమిదే!

ఇక సర్జరీ కూడా విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, ఈ వారంలో జరిగే ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా ఆయన హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అక్కడ నుంచి మొదలుపెట్టి సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఒక రేంజ్‌లో చేయబోతున్నారు. చిరంజీవి కూడా మీడియా ముందుకు వస్తారని, వరుస ఇంటర్వ్యూలు ఇస్తారని తెలుస్తోంది. అయితే ఈ సర్జరీకి సంబంధించిన విషయాలు మాత్రం చిరు టీమ్ ఎక్కడా ప్రస్తావించడం లేదు, గోప్యంగా ఉంచుతోంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.

Also Read: God Of War: ఎన్టీఆర్ -బన్నీ’ల దెబ్బ.. సినిమా నిలిపివేసిన త్రివిక్రమ్?

ఇక తాజాగా రిలీజ్ అయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సాహు గారితో కలిసి మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

Exit mobile version