Chiranjeevi: వైరల్.. సూపర్ స్టార్‌గా మెగాస్టార్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ స్టైల్, డాన్స్, మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తరం హీరోల్లో చాలామంది ఆయన ఇన్షిపిరేషన్‌తో వచ్చిన వారే ఉన్నారు. ముఖ్యంగా డాన్స్ విషయంలో మెగాస్టార్‌ను ఫాలో అవని హీరోలు లేరనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు మెగాస్టార్‌ను ఇమిటేట్ చేసిన హీరోలు.. అభిమానులు చాలామందే ఉన్నారు. కానీ మరో స్టార్ హీరోని మెగాస్టార్ ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు అదే చేశారు మెగాస్టార్ చిరంజీవి. అది చూసిన తర్వాత.. మెగాభిమానులే కాదు ప్రతి ఒక్కరు మెగాస్టార్ అదరహో అంటున్నారు. రీసెంట్‌గా ఆహా ఓటిటి సంస్థ నిర్వహించిన ‘ తెలుగుఇండియన్ ఐడల్’ ఫైనల్ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరు.
ఈ ఎపిసోడ్ లో చిరంజీవి తనదైన స్టైల్‌తో అందరిలో జోష్ నింపారు. అంతేకాదు ఇదే స్టేజిపై సూపర్ స్టార్ రజినీకాంత్‌ను ఇమిటేట్ చేసి ఔరా అనిపించారు. స్టైజ్ పైకి తలైవాలా నడుచుకుంటూ వెళ్లి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. దాంతో ఈలలు, కేరింతలతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా.. ఇతడు నా అభిమాని కాదు.. రజినీకాంత్‌కు అభిమాని.. అంటూ స్టేజ్ మీదున్న వ్యక్తినుద్దేశించి చెప్పుకొచ్చారు చిరు. ఆ తర్వాత కంటెస్టెంట్‌కి ఓ కళ్ళజోడు బహుమతిగా ఇచ్చి.. రజినీ స్టైల్ లో పెట్టుకోమన్నారు. ఇలా సూపర్ స్టార్‌ని మెగాస్టార్ ఇమిటేట్ చేసిన వీడియోని.. ఆహ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. రజినీకాంత్ బీజీఎంకు చిరు వాకింగ్ చేస్తే ఎట్లుంటది.. ఇట్టా ఉంటది.. అనే క్యాప్షన్‌తో ఆహా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో రజనీ, చిరు కలిసి కొన్ని చిత్రాల్లో కూడా నటించారు. కానీ స్టైల్ విషయంలో ఈ ఇద్దరి రూటు చాలా సపరేటు. మెగాస్టార్‌గా.. సూపర్ స్టార్‌గా ఈ ఇద్దరి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. అలాంటిది.. రజనీ వాకింగ్ స్టైల్‌ను చిరు చేసి చూపించడం.. అదిరిపోయిందని చెప్పొచ్చు. ఏదేమైనా మెగాస్టార్, సూపర్ స్టార్.. ఇద్దరు ఇద్దరే.
Also Read
- Memu Kapulam: 'మేము కాపులం' టైటిల్ పబ్లిసిటీ కోసమే.. కానీ అందులో బూతులుండవు: బి.వి.ఎస్.రవి
- BVS Ravi: పూరి జగన్నాథ్ ఆగి ఆలోచిస్తే ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుంది: బి.వి.ఎస్.రవి
- BVS Ravi: బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ సీక్రెట్ బయటపెట్టిన బి.వి.ఎస్. రవి! అసలు విషయం ఇదే..
- Peddi : బెజవాడలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. సెలబ్రేషన్స్ పీక్స్
Rajini BGM ki Chiru walking chesthe ettauntadi? 🤩 ITTA untadi.. 😎#MegaFinale and all episodes Streaming Now.@KChiruTweets @MusicThaman @MenenNithya @singer_karthik @Sreeram_singer @fremantle_india @ZeptoNow
#ChandanaBrothers @instagram @tnldoublehorse@MobilesHappi pic.twitter.com/nqcRsZD79P— ahavideoin (@ahavideoIN) June 19, 2022
తాజావార్తలు
-
Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
-
Chivas Regal, Absolut Vodka Ban: మందుబాబులకు షాక్.. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం..!
-
Rishabh Pant: రూ.27 కోట్ల పంత్ ఫెయిల్.. LSG కెప్టెన్సీకి గుడ్‌బై
-
Supreme Court: వేధించడానికే పెళ్లిళ్లు చేసుకుంటారా? అబ్బాయిలకు సుప్రీంకోర్టు చీవాట్లు
-
Colonel Sanders: 60 ఏళ్ల వయసులో రూ. 9 వేల పెన్షన్‌తో మొదలైన బిలియన్ డాలర్ల సామ్రాజ్యం.. కేఎఫ్‌సీ పెద్దాయన కథ ఇదే!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!