Site icon NTV Telugu

Chiranjeevi : నా కెరీర్ లో స్టాలిన్ ఎంతో ప్రత్యేకం.. చిరు ఎమోషనల్

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ స్టాలిన్. 2006లో వచ్చిన ఈ సినిమాను నాగబాబు నిర్మించారు. ఈ సినిమా 2006లో వచ్చింది. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. స్టాలిన్ సినిమా నా కెరీర్ లో ఎంతో ప్రత్యేకం. ఆ సినిమా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని నేర్పించింది. ఎన్నో సినిమాల్లో నటించిన నాకు ఈ సినిమా ఒక గౌరవంగా అనిపిస్తుంది. దేశ సరిహద్దుల్లో యుద్ధం చేయడమే కాకుండా దేశం లోపల ఉన్న శత్రువులతో పోరాడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది ఈ సినిమా. ఒక సోల్జర్ మాత్రమే దేశాన్ని అమితంగా ప్రేమిస్తాడు అనేది ఇందులోని కాన్సెప్ట్ అంటూ తెలిపారు చిరంజీవి.

Read Also : Sai Durga Tej : మెగా హీరోతో ప్రభాస్ డైరెక్టర్ సినిమా..!

కేవలం శత్రువులతో పోరాడటమే కాకుండా తోటి వారికి సాయం చేయాలని ఇందులోని తన స్టాలిన్ పాత్ర చెబుతుందన్నారు. మనం ఎవరికైనా సాయం చేస్తే అక్కడితో దాన్ని వదలకుండా అవతలి వ్యక్తి కూడా మరో ముగ్గురుకు సాయం చేయాలని కోరడం వల్ల సాటి మనిషికి సాయం చేయాలనే తపన అందరిలోనూ పెరుగుతుందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు మూవీ గురించి స్పెషల్ గా రాసుకొచ్చారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు నిర్మాత నాగబాబు రెడీ అవుతున్నారని.. ఈ సందర్భంగా ఇందులో నటించిన వారికి, డైరెక్టర్ మురుగదాస్, నిర్మాత నాగబాబుకు విషెస్ చెప్పారు చిరంజీవి.

Read Also : Coolie : అమీర్ ఖాన్, నాగార్జునను డామినేట్ చేసిన చిన్న నటుడు..

Exit mobile version