Site icon NTV Telugu

Chiranjeevi : డైరెక్టర్ బాబీకి ఖరీదైన వాచ్ ఇచ్చిన చిరు..

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీకి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. చిరంజీవికి స్వయంగా ఫ్యాన్ అయిన బాబీ.. ఫ్యాన్ బాయ్ సినిమా అంటూ గతంలో చిరుతో వాల్తేరు వీరయ్య మూవీ తీసి మంచి హిట్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరి నడుమ మంచి సాన్నహిత్యం కొనసాగుతోంది. త్వరలోనే చిరుతో మరో మూవీ తీసేందుకు కూడా రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి డైరెక్టర్ బాబీకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. తాజాగా ఆ ఫొటోలను పంచుకున్నాడు బాబీ.

Read Also : Mani Rathnam: థగ్ లైఫ్ అలా మొదలైంది!

చిరంజీవి ఖరీదైన వాచ్ ను బాబీకి గిఫ్ట్ ఇచ్చాడు. దీనిపై బాబీ స్పెషల్ ట్వీట్ చేశాడు. ‘చిరంజీవి గారి నుంచి నాకు మెగా సర్ ప్రైజ్ వచ్చింది. ఈ బహుబతికి అస్సలు వెలకట్టలేను. థాంక్యూ అన్నయ్య. ఈ గిఫ్ట్ ను ఎప్పటికీ గుర్తుంచుకుంటా’ అంటూ రాసుకొచ్చాడు బాబీ. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి గతంలో చాలా మందికి ఇలాంటి గిఫ్ట్ లు ఇచ్చారు. ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి వారిని ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పుడు బాబీకి కూడా అలాంటి గిఫ్ట్ తో ఎంకరేజ్ చేశారని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

Read Also : Bandi Sanjay: గతంలో ఇదే హిందూ ఏక్తా యాత్ర చేస్తుంటే నాకు గుండెపోటు వచ్చింది..

Exit mobile version