ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, భార్య పక్కన ఉన్నప్పుడు ఆమె మాట వినడం తప్పనిసరి అని వివరించిన సుస్మిత కొణిదెల, మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక హాస్యాస్పద ఘట్టాన్ని పంచుకున్నారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన, కిష్కింధపురి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో గెస్ట్‌గా హాజరైన సుస్మిత ఆమె అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సందర్భంలో యాంకర్ సుమ, చిరంజీవి భార్య సురేఖకి భయపడిన సందర్భం ఉందా అని అడగా.. అప్పుడు సుస్మిత ఒక రియల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు.
Also Read : Sreeleela : ఫ్యాన్ బాధను తీరుస్తూ ..హృదయాన్ని హత్తుకున్న శ్రీలీల రిప్లై
‘మన శంకర వరప్రసాద్ కోసం ప్రెజెంట్ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు, సినిమా సెట్స్ కు అమ్మ వచ్చింది, అప్పటి వరకు బాగానే డ్యాన్సులు చేస్తున్న నాన్న, అమ్మ వచ్చి కూర్చునేసరికి స్టెప్స్ మర్చిపోవడం, డ్యాన్సుల్లో తడబడటం లాంటివి జరిగాయి, ఇవన్నీ అమ్మ ముందు ఉండటం వల్లే జరిగాయి’ అని అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈ హాస్యాస్పద సంఘటనతో ప్రేక్షకులు ఎంత పెద్ద స్టార్ అయినా భార్య పక్కన ఉంటే తడబడవలసిన సందర్భాలు వస్తాయని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. సినిమా విషయానికొస్తే, మనం శంకర వరప్రసాద్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతానికి షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నది. సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.