Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా మెగాస్టార్ ఫాన్స్ తో జరిగిన ఓ సమావేశంలో చిరంజీవి ఎమోషనల్ అయ్యి, ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నా విషయానికి వస్తే, నాకు అవమానాలు లేకుండా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇదే బ్లడ్ కి సంబంధించిన మాట వస్తే, “బ్లడ్ అమ్ముకున్నాడు” అనుకుంటారు. మీరు చెప్పండి, నాకు వచ్చే రెమ్యునరేషన్ తో పోల్చుకుంటే, ఎన్ని కోట్ల ప్యాకెట్లు అమ్మితే నాకు ఆ డబ్బుతో సమానం? చెప్పండి. అది ఎంత ఫూలిష్‌నెస్! వాళ్ళు అనే మాట… ఎక్కడా బయట చేయి చాచి, ఎక్కడా డొనేషన్స్ తీసుకోకుండా, నా కష్టార్జితం తోటి నేను ఈరోజు బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నాను. దాని వెనకాల నేను పెట్టేది కొంత, కానీ మీరు సహకరించేది ఎంతో! వీటిని వెలకట్టగలమా మనం? అందుకని అలాంటి వాటిల్ని పట్టించుకోకూడదు, నేను పట్టించుకోను అని అన్నారు. అది అదృష్టం అని కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి లేదనేది లేదు. అదృష్టం అని పక్కన పెట్టాల్సిందే, అదృష్టం అని నేనైతే నమ్మను. నేను కష్టాన్ని నమ్ముకుంటాను, కష్టమే తీసుకెళ్తుంది. ఈ కష్టంలో ఉన్నప్పుడు మనం కొంచెం కామన్ సెన్స్ తోటి, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో ఉండాలి. అవకాశాలు వస్తూ ఉంటాయి, వచ్చిన అవకాశాన్ని మనం ఎంబ్రేస్ చేసుకోవాలి. దాన్ని ఆలింగనం చేసుకొని, దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్లగలగాలి అని అన్నారు.
ఈరోజున వరల్డ్ లో అత్యున్నతమైనటువంటి సంస్థల్లో సీఈఓ (CEO) లుగా ఉన్నవాళ్ళు ఎంతో మంది. అది మన అదృష్టం, మనం గర్వంగా చెప్పుకోవాలి, మన ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు. ఇందులో వరల్డ్ బ్యాంక్ నుంచి అయితేనేమి, గూగుల్ అయితేనేమి.. ఏదైనా సరే.. సత్య నాదెళ్ల, వీళ్ళందరూ.. సో, వీళ్ళందరూ మనలో ఉన్నవాళ్లే! మన ఊరి దగ్గర ఉన్నవాళ్లే, మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్లే. అది ఎవరికో దక్కుతుంది, కొంతమందికే దక్కుతుంది, కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు అని చిరు అన్నారు. నేను ఎవరినండీ? ఎక్కడో ఒక చిన్న పల్లెటూర్లో ఉన్నాను. సాదాసీదా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. బట్ ఎందుకంటే, నా ఎయిమ్, నా ఇంట్రెస్ట్ ఇది అని గ్రహించగలిగాను. చిన్నప్పుడే ఆ ఇంట్రెస్ట్ మీద నేను డెవలప్ చేసుకుంటూ వెళ్ళగలిగాను. ఆ తర్వాత ఆలోచన వచ్చినప్పుడు, “వై నాట్? నేను ఎందుకు చేయకూడదు? నేను ఎందుకు అవ్వకూడదు?” అనుకున్నాను. నా మీద నాకు నమ్మకం నేను ఏర్పరచుకున్నానని ఆయన అన్నారు.
Also Read
- Mohan Babu: "ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు.." మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
- Nandi Awards: త్వరలోనే నంది అవార్డుల వేడుక.. అమరావతిలో సినిమాలు, తిరుపతిలో టీవీ పురస్కారాలు!
- Kayadu Lohar: "తెలంగాణ యాస నా వల్ల కాలేదు!"
అప్పుడప్పుడు కొంచెం నమ్మకం సడలినప్పుడు, అద్దంలో చూసుకుంటూ ఉంటా.. ‘ఏయ్, గ్రేట్ రా!’ అనిపిస్తుంటాను. నన్ను నేను పెప్ అప్ చేసుకుంటాను. ఇలాంటివి జరుగుతుంటాయి. చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసి అద్దంలో చూసుకుంటాను.. “నన్ను మించినవాడు ఎవడున్నాడురా? శభాష్!” [నవ్వు] అని అనుకుంటూంటాను. అది ఎందుకంటే, నువ్వు ఎప్పుడైనా నీరసించిపోయినప్పుడు అది నిన్ను పెప్ అప్ చేస్తది. దానికి ఆధారంగానే ఏంటంటే.. ప్రకృతి అనేది ఎవరికైనా సరే, ఎప్పుడు నువ్వు ఏది కోరుకుంటే, దానికి ఏది ఇస్తే.. దానికి పదింతలు నీకు తిరిగి వెనక్కి ఇస్తూ ఉంటుంది. ఇది ‘ది సీక్రెట్’. సో, లా ఆఫ్ అట్రాక్షన్ (Law of attraction).. నువ్వు దేన్ని ఆకర్షించాలని కోరుకుంటావో, అదే నిన్ను ఆకర్షిస్తుంది తిరిగి అని చిరంజీవి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!