Chiranjeevi vs Balakrishna: ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’ రెండు చిత్రాలలోనూ శ్రుతి హాసన్ నాయికగా కనిపించనున్నారు. ఇలా ఒకే సారి, ఒకే హీరోయిన్ తో చిరు, బాలయ్య పోటీ పడ్డ సందర్భాలూ ఉన్నాయి. అలా నాలుగు సార్లు చిరంజీవి, బాలకృష్ణ ఢీ కొన్నారు. అందులో రెండు సార్లు సంక్రాంతి బరిలో ఒకే నాయికతో ఢీ కొన్న సందర్భాలు కనిపిస్తున్నాయి. 1988లో చిరంజీవి ‘మంచిదొంగ’లో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా విజయశాంతి నటించారు. ఆమెనే బాలకృష్ణ ‘ఇన్ స్పెక్టర్ ప్రతాప్’లోనూ నాయికగా సందడి చేశారు. ఆ రెండు సినిమాలు ఒక్కో ఏరియాలో ఒక్కోలా పైచేయి సాధించాయి.
ఇక 2001లో బాలకృష్ణ ‘నరసింహనాయుడు’లో మెయిన్ హీరోయిన్ గా నటించిన సిమ్రాన్, చిరంజీవి ‘మృగరాజు’లోనూ నాయికగా కనిపించారు. ఫలితం తెలిసిందే! మరి ఈ సారి పొంగల్ బరిలోనే ఒకే నాయికతో చిరు, బాలయ్య సినిమాలు ఢీ కొంటున్నాయి. అదీ రెండు సినిమాలను ఒకే సంస్థ ‘మైత్రీ మూవీమేకర్స్’ నిర్మించడం మరింత విశేషం! మరి ఈ సారి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలని అబిమానుల్లో ఉత్కంఠ సాగుతోంది.