Chiranjeevi – Anil : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మెగా 157 మూవీ షూట్ స్పీడ్ గా జరుగుతోంది. మొన్నటి దాకా కేరళలో ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. దాన్ని జెట్ స్పీడ్ గా కంప్లీట్ చేసేసి తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు టీమ్. కేరళలో పెళ్లి వేడుకను షూట్ చేసినట్టు తెలుస్తోంది. మొన్న చిరంజీవి, నయనతార పెళ్లి బట్టల్లో కనిపించారు. అది చూస్తే కచ్చితంగా పెళ్లి వేడుకను లేదంటే ఏదైనా పాటను షూట్ చేశారేమో అనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లోని ఓ సెట్ లో స్పీడ్ గా షూటింగ్ నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also : HHVM : ఓజీకి ఉన్న క్రేజ్ వీరమల్లుకు ఎందుకు లేదు.. పవన్ ఆన్సర్ ఇదే..
చిరంజీవి, అనిల్ తాజాగా హైదరాబాద్ కు చేరుకున్న ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ ప్రైవేట్ ఫ్లైట్ లో హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇందులో ఇద్దరి లుక్స్ అదిరిపోయాయి. చిరంజీవి వింటేజ్ లుక్ లో ఇందులో మెరుస్తున్నారు. నయనతార ఇందులో కనిపించలేదు. ఈ మూవీని వచ్చే 2026 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జెట్ స్పీడ్ తో షూటింగ్ చేస్తున్నారు.
Read Also : HHVM : గురువు సత్యానంద్ కు పాదాభివందనం చేసిన పవన్..
