Site icon NTV Telugu

Chiranjeevi: అమ్మలందరికీ ‘మదర్స్ డే’ విషెస్

Chiranjeevi Wishes Mothers Day

Chiranjeevi Wishes Mothers Day

‘మదర్స్ డే’ని పురష్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి భూమ్మీద ఉండే అమ్మలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో తన తల్లి అంజనా దేవి, పవన్ కళ్యాణ్, నాగబాబులతో కలిసి ఉన్న ఒక వీడియోని షేర్ చేశారు. గతంలో ఓసారి గాడ్‌ఫాదర్, భీమ్లా నాయక్ చిత్రీకరణలు ఒకేసారి జరిగాయి. ఆ సమయంలో అంజనా దేవి, నాగబాబు లొకేషన్‌కు చేరుకొని.. సెట్‌లో కాసేపు గడిపారు. అందరూ కలిసి సెట్‌లోనే భోజనం చేశారు. చూడ్డానికి ఎంతో చూడమచ్చటగా ఉండే ఈ వీడియోను అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సెలెబ్రిటీలు హ్యాపీ మదర్స్ డే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇండస్ట్రీకి ఎంత మెగాస్టార్ అయినా, తల్లికి మాత్రం చిరంజీవి పసిబిడ్డే! అమ్మంటే చిరు సహా పవన్, నాగబాబులకు ఎంతో ఇష్టం. సినిమాలు, ఇతర పనులతో బిజీగా ఉండే ఈ ముగ్గురు మెగా బ్రదర్స్.. సమయం దొరికినప్పుడల్లా అమ్మతో కలిసి సమయం గడుపుతారు. అమ్మకి కావాల్సిన వంటకాలూ చేసి పెడతారు. అమ్మ ఒడిని చేరగానే, పసివాళ్ళుగా మారిపోతారు. అమ్మ జోలికి వస్తే మాత్రం.. తాట తీయడానికి సిద్ధమైపోతారు కూడా! అప్పుడప్పుడు అమ్మతో సరదాగా గడిపిన క్షణాల్ని, తమ అభిమానులతో సోషల్ మీడియా మాధ్యమంగానూ పంచుకుంటారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చిరంజీవి గాడ్‌ఫాదర్, భోళా శంకర్, మెగా154 (బాబీ దర్శకుడు) సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మూడు సినిమాల చిత్రీకరణల్లోనూ ఒకేసారి పాల్గొంటున్నారు.

Exit mobile version