NTV Telugu Site icon

Chinmayi Sripada: చిన్మయి మరో బాంబ్.. ఆయన మంచోడు కాదు

Sripada On Vairamuthu

Sripada On Vairamuthu

Chinmayi Sripada Controversial Comments On Vairamuthu: మీటూ ఉద్యమం మొదలైనప్పటి నుంచి తమిళ సినీ నిర్మాత, రచయిత వైరముత్తుపై సింగర్ చిన్మయి ఆరోపణలు చేస్తూ వస్తోంది. తనని ఆయన వేధింపులకు గురి చేశాడని, ఎన్నోసార్లు కోరిక తీర్చమని అడిగాడని కుండబద్దలు కొట్టింది. గతంలో తన పట్ల రెండుసార్లు అసభ్యంగా ప్రవర్తించాడని, కోరిక తీర్చకపోతే తన కెరీర్ ముగుస్తుందని బెదిరింపులకు కూడా పాల్పడ్డారని, అయినా తాను లొంగలేదని చిన్మయి చెప్పుకొచ్చింది. విదేశాలలో ప్రోగ్రామ్ కోసం వెళ్లినప్పుడు.. వైరముత్తు ఇలా తనని వేధించినట్టు ఆమె ట్విటర్ మాధ్యమంగా ఆవేదన వ్యక్తం చేసింది. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేగింది. ఆమెను తమిళ చిత్ర పరిశ్రమ నుంచి బ్యాన్ చేయడం కూడా జరిగింది.

Pathan Controversy: పఠాన్ వివాదం.. ప్రవక్తపై మధ్యప్రదేశ్ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడు చిన్మయి మరోసారి వైరముత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన మంచి వ్యక్తి కాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ వైరముత్తు వద్దకు ఒంటరిగా వెళ్లొద్దని.. యువ నటి అర్చనకు సూచించింది. తొలుత ఆయన మంచి వ్యక్తిగానే కనిపిస్తారని, కానీ ఆ తర్వాత తన అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తారని, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడని బాంబ్ పేల్చింది. ఇటీవల వైరముత్తును కలిసిన అర్చన.. గొప్ప రచయిత అయిన ఆయన్ను కలవడం సంతోషంగా ఉందని పేర్కొంటూ, ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఈ నేపథ్యంలో చిన్మయి స్పందిస్తూ.. మొదట్లో ఇలాగే మొదలవుతుందని, ఆయనతో జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. వీలైనంత వరకు ఆయనకు దూరంగా ఉండాలని, నీ పక్కన వేరే వ్యక్తులు లేకుండా ఒక్కదానివే వెళ్లి వైరముత్తుని కలవొద్దని పేర్కొంది.

Dalai Lama: చైనాకు తిరిగెళ్లే ప్రసక్తే లేదు.. భారత్‌లోనే ఉంటా

Show comments