Site icon NTV Telugu

Singer Chinmayi : లైంగిక వేధింపులను ప్రోత్సహించడమే.. జానీ మాస్టర్ పై చిన్మయి సంచలనం

Chinmai

Chinmai

Singer Chinmayi : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఇప్పుడు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. రామ్ చరణ్‌ పెద్ది సినిమాలో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మరికొన్ని సినిమాల్లో వరుస ఛాన్సులు వస్తున్నాయి. శ్రష్టి వర్మ పెట్టిన లైంగిక వేధింపుల కేసు తర్వాత చాలా కాలం జానీ మాస్టర్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నాడు. అయితే తాజాగా జానీ మాస్టర్ పై సింగర్ చిన్మయి సంచలన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Read Also : Peamante : ప్రియదర్శి మూవీ టీజర్ రిలీజ్

ఆమె ట్వీట్ లో ఏముందంటే.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ లాంటి వాళ్లకు ఛాన్సులు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు తెలపడమే అవుతుంది. డబ్బును, అధికారాన్ని దుర్వినియోగం చేసే వారి చేతుల్లో పెట్టొద్దంటూ కోరింది. ఇలాంటి వారికి ఛాన్సులు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులను ప్రోత్సహించడమే అవుతుందంటూ ఆమె ఫైర్ అయింది. ఆమె ట్వీట్ పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరు ఆమెకు సపోర్టు చేస్తుంటే.. ఇంకొందరు ఆమె పోస్టుకు నెగెటివ్ కామెంట్లు పెట్టేస్తున్నారు.

Read Also : Prashanth Varma : అవన్నీ ఫేక్ న్యూస్ : ప్రశాంత్ వర్మ

Exit mobile version