Site icon NTV Telugu

Chinmayi: డబ్బు ఎంతైనా ఇస్తా.. నాతో గడుపు అన్నాడు..

Chinamyi

Chinamyi

Chinmayi: సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గొంతు విప్పితే.. సంగీత ప్రియులు పరవశించిపోతారు. ఇక అదే గొంతు చిన్మయి ఆడవారికి అండగా విప్పితే.. కామాంధులు భయపడిపారిపోవడమే. ఇక సోషల్ మీడియాలో చిన్మయి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎన్నో వివాదాలు.. మరెన్నో విమర్శలు.. వేటిని ఆమె ఈజీగా తీసుకోదు. విమర్శించినవారిని ఆమె ఊరికే వదలదు.. అందరి ముందు కామాంధుల నిజస్వరూపాన్ని ఎండగడుతుంది. తాజాగా ఒక నెటిజన్ నిజస్వరూపాన్ని ఆమె బయటపెట్టింది. ఒక వ్యక్తి.. ఆమెతో ఎంతో వల్గర్ గా మాట్లాడాడు. ముందుగా మంచి వ్యక్తిలా పరిచయం చేసుకొని.. ” మీరంటే మాకు చాలా ఇష్టం.. ఆడవారి కోసం మీరు నిలబడిన తీరు ఆకట్టుకుంటుంది. మా చెల్లి కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది ” అని మాట్లాడేవాడట. కానీ ఆ మెసేజ్ లకు చిన్మయి రిప్లై ఇవ్వకపోవడంతో అతడిలోని నిజస్వరూపం బయటపెట్టాడని చిన్మయి చెప్పుకొచ్చింది.

Payal Ghosh: ఆ ఇండస్ట్రీలో ట్యాలెంట్ అవసరం లేదు.. బట్టలు విప్పితే చాలు

“ఇదుగో ఈ చెత్త వెధవను చూడండి. మొదట నా గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. నేను రిప్లై ఇవ్వకపోయేసరికి.. ” నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా.. నాతో కొంత సమయం గడుపు అను అడుగుతున్నాడు. అంతటితో ఆగక నీకు ఏం కావాలన్నా కొంటాను.. లగ్జరీ జీవితాన్ని ఇస్తాను.. అని వరుసబెట్టి మెసేజ్‌లు పంపాడు. వీడిని ఏం అనాలి.. వీడిని కాదు.. వీడి నాన్నను అనాలి. అలా పెంచారు. ఇంత చెత్తగా ఎలా పెంచారు. అమ్మాయిలు మీరు జాగ్రత్త” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోటీ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version