అప్పుడెప్పుడో వచ్చిన రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో, చిన్నప్పటి రామ్ చరణ్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు బాల నటుడు రోహన్. తర్వాత ‘#90s’ అంటూ శివాజీ ప్రధాన పాత్రలో వచ్చిన ఈటీవీ విన్ ఒరిజినల్ వెబ్ సిరీస్‌లో ‘సాంప్రదాయని శుద్ధపూస’గా నటించి, ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నాడు.
Also Read:Mad Sequel : ఈసారి ఊహించని విధంగా నాగవంశీ ప్లాన్ !
ఈ మధ్యకాలంలో ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో కీలక పాత్రలో మెరిశాడు. అంతేకాక, ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాలో కూడా ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ బాల నటుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ సినిమాగా ఈ సినిమాని వశిష్ట డైరెక్ట్ చేస్తున్నాడు.
Also Read:MSVG: మెగాస్టారా మజాకా.. 5 రోజుల్లో “మన శంకరవరప్రసాద్ గారు” కలెక్షన్స్ ఎంతంటే..?
ఈ సినిమాలో కాళ్లకు చక్రాలు కట్టుకుని ఉండే ఒక బాలుడి పాత్రలో రోహన్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్ (VFX) వర్క్ మీద టీం ఫోకస్ చేసింది. ఎన్ని రోజులు ఆలస్యమైనా పర్లేదు, వి.ఎఫ్.ఎక్స్ పర్ఫెక్ట్‌గా వచ్చినప్పుడే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తోంది టీం. ఈ నేపథ్యంలో వి.ఎఫ్.ఎక్స్ ఫైన్ ట్యూన్ చేసే పనిలో ఉన్నారు. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ మీద దృష్టి కేంద్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా దాదాపుగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
