Chennai Love Story :రివ్యూయర్స్ ను తిట్టకుండా.. మాట విన్నారు, హిట్టు కొట్టారు!

Chennai Love Story

Chennai Love Story

సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే చాలు, దర్శకనిర్మాతలు సాధారణంగా రివ్యూయర్స్ పై మండిపడటం, పబ్లిక్ టాక్‌ను తప్పుపట్టడం చేస్తుంటారు. కానీ, ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్. రివ్యూవర్లను బ్లేమ్ చేయకుండా, వారి మాటలని పట్టుకుని సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఈ మూవీ సక్సెస్ వెనుక ఉన్న బిగ్గెస్ట్ ప్లాట్ ట్విస్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రైటర్ కమ్ ప్రొడ్యూసర్ సాయి రాజేష్ నిన్న సక్సెస్ మీట్లో బయటపెట్టిన ఒక షాకింగ్ నిజం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రీమియర్ షోల తర్వాత రివ్యూయర్స్ , ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్, కొన్ని చోట్ల ఆడియెన్స్ హాల్ నుంచి వాకౌట్ చేయడం వంటి పరిణామాలను ఆ టీమ్ సీరియస్‌గా తీసుకుంది. ఇగోకు పోకుండా, ప్రేక్షకుల అభిప్రాయమే శిరోధార్యమని భావించారు.

ఆ తర్వాతే అసలైన మేజిక్ జరిగింది. రాత్రికి రాత్రే సెకండాఫ్ మొత్తాన్ని రీవర్క్ చేసి, ఎడిటింగ్ మార్పులతో కూడిన అప్‌డేటెడ్ వర్షన్‌ను శుక్రవారం మ్యాట్నీ షోలకల్లా థియేటర్లకు పంపించారు మేకర్స్. సినిమా విడుదలైన తర్వాత ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఈ డేరింగ్ స్టెప్ అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. మొదట్లో వచ్చిన మిక్సడ్ రివ్యూలు కాస్తా, బ్లాక్‌బస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్‌గా మారాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘చెన్నై లవ్ స్టోరీ’ ఎలాంటి అడ్డంకులు లేకుండా దూసుకుపోతోంది. విమర్శలను తప్పుపట్టకుండా, ప్రేక్షకులు చెప్పింది వింటే ఎలాంటి విజయాలు సాధించవచ్చో ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఏది ఏమైనా.. రివ్యూవర్లు, ఆడియెన్స్ మాట విని, కరెక్ట్ టైమ్‌లో స్పందిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ సక్సెస్ నిరూపిస్తోంది!