NTV Telugu Site icon

Rashmika : ‘ఛావా’ మూవీ ఓటీటీ డేట్ లాక్ ..?

Chava (3)

Chava (3)

తాజాగా బాలీవుడ్ నుంచి వచ్చి సంచలన విజయం అందుకున్న చిత్రం ‘ఛావా’. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ మూవీలో శంభాజీగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, ఆయన సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించగా, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా  రిలీజైన నాటి నుంచి  థియేటర్లన్నీ జై జగదంబే, జై శివాజీ, జై శంభాజీ అనే నినాదాలతో మారుమోగుతున్నాయి. ప్రేక్షకుల భావోద్వేగాలు, సినిమా చూసి విలపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం . అలా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు, మూడో వారంలో రూ. 87 కోట్లు రాబట్టి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో రూ.700 కోట్ల క్లబ్‌లో చేరిన 9వ బాలీవుడ్ సినిమాగా ‘ఛావా’ నిలిచింది.

Also Read: Kannappa : ‘కన్నప్ప’ మేకింగ్ వీడియో షేర్ చేసిన విష్ణు

అయితే ఈ మూవీ హిందీలో మాత్రమే విడుదల కావడంతో, తెలుగు ప్రేక్షకుల కోరిక మేరకు తాజాగా ఇక్కడ కూడా విడుదల చేశారు. అనుకున్నట్లుగానే తెలుగులో కూడా ఈ ‘ఛావా’ ధూసుకుపోతుంది. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్‌కి రాబోతున్నట్లు టాక్. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.