Site icon NTV Telugu

charlie chaplin: నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ ఇంట తీవ్ర విషాదం..

Charli

Charli

charlie chaplin: నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చార్లీ చాప్లిన్ కుమార్తె, నటి జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ఈ ఘటన జరిగి పది రోజులు అయ్యినట్లు తెలుస్తోంది. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం ఈ మధ్యనే మీడియాకు అధికారికంగా ప్రకటించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. జోసెఫిన్ చాప్లిన్ వయస్సు 74. గత కొన్ని రోజులుగా ఆమె వృద్ధాప్య సమస్యలతో పోరాడుతుందని ఆమె సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. చార్లీ చాప్లిన్ – ఊనా ఓ నీల్‌ దంపతులకు మొత్తం 8 మంది సంతానం కాగా వారిలో జోసెఫిన్ చాప్లిన్ మూడో సంతానం. ఆమె మూడేళ్ళ వయస్సులోనే తండ్రి నటించిన లైమ్‌ లైట్ చిత్రంలో కనిపించింది. ఇక తండ్రి బాటలోనే నటిగా మారి మంచి సినిమాల్లో నటించి మెప్పించారు.

Pooja Hegde : మాస్ రాజా రవితేజ సినిమాలో నటించబోతున్న బుట్టబొమ్మ..?

ఇక 1969లో నికోలస్‌ ను పెళ్లి చేసుకున్న జోసెఫిన్.. అతనితో విబేధాల కారణంగా 1977లో అతని నుంచి విడాకులు తీసుకొని సింగిల్ గా ఉంది. అనంతరం కొన్నాళ్ళకు.. ఫ్రెంఛ్ నటుడు మారిస్ రోనెట్ తో సహజీవనం చేసింది. అతను మృతి చెందేవరకు కూడా అతడితోనే కలిసి జీవించింది. ఇక అతని మృతి తరువాత ఆర్కియాలజిస్ట్ జీన్‌ క్లూడ్‌ గార్డెన్‌ ను వివాహమాడింది.. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇక జోసెఫిన్ మృతి పట్ల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్త చేయడమే కాకుండా ఎన్నో అనుమానాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. జోసెఫిన్ మృతి చెంది పది రోజులు అయినా కుటుంబ సభ్యులు ఎందుకు మీడియా ముందుకు చెప్పలేదు. ఆమె మృతితో ఎవరికైనా ప్రాబ్లెమ్ ఉందా.. ? ఆస్తి తగాదాలు ఉన్నాయా.. ? లేక ఇంకేదైనా సమస్యా. ? అని డౌట్ పడుతున్నారు. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version