charlie chaplin: నవ్వుల రారాజు చార్లీ చాప్లిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చార్లీ చాప్లిన్ కుమార్తె, నటి జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ఈ ఘటన జరిగి పది రోజులు అయ్యినట్లు తెలుస్తోంది. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం ఈ మధ్యనే మీడియాకు అధికారికంగా ప్రకటించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. జోసెఫిన్ చాప్లిన్ వయస్సు 74.