NTV Telugu Site icon

Mahesh Babu: జూనియర్ మహేష్ బాబు.. ఈ అల్లుడేనేమో.. మరీ జిరాక్స్ కాపీలా ఉన్నాడే..?

Mahesh

Mahesh

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైల్, స్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పరిగెత్తే స్టైల్ ను బట్టి.. ముఖం చూడకుండా మహేష్ బాబు అని చెప్పొచ్చు. ఇక పోకిరి లో మహేష్ యాటిట్యూడ్ చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అలాంటి స్వాగ్ ను ఎవరు బీట్ చేయలేరు.. ఎవరు ఎన్నిసార్లు మహేష్ ను ఇమిటేట్ చేసినా మహేష్ లో కలిసేవారు ఒక్కరు కూడా లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక మహేష్ వారసుడు గౌతమ్ ఉన్నా కూడా.. అతను కృష్ణ పోలికలతో కనిపిస్తాడు. అది కాకుండా గౌతమ్ చాలా సైలెంట్.. తండ్రి యాటిట్యూడ్ ను, స్వాగ్ ను ఎప్పుడు మ్యాచ్ చేసినట్లు అభిమానులు చూడలేదు. ప్రస్తుతం గౌతమ్ చదువులో బిజీగా ఉన్నాడు. విదేశాల్లో ఉండడంతో అతను ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించింది లేదు. అయితే గౌతమ్ లేకపోతే ఏం.. అచ్చు మహేష్ ను దింపడానికి అల్లుడు ఉన్నాడుగా అని అంటున్నారు అభిమానులు.

Project K: ప్రభాస్ ఫ్యాన్స్ కు చేదు వార్త.. ప్రాజెక్ట్ కె వాయిదా.. ?

అర్ధం కాలేదా.. మహేష్ బాబు మేనల్లుడు .. చరిత్ మానస్ గురించి అందరికి తెలిసిందే. అదేనండీ.. మహేష్ అక్క ప్రియదర్శిని, హీరో సుధీర్ బాబు కొడుకు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన చరిత్ పెద్దవాడు అయ్యాడు. ఇక అతడు అచ్చు గుద్దినట్లు మేనమామ మహేష్ బాబులా కనిపిస్తున్నాడు. ఆ నడక, నవ్వు, యాటిట్యూడ్, స్వాగ్ మొత్తం మహేష్ కు జిరాక్స్ లా ఉన్నాడే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. సుధీర్ బాబు సైతం చరిత్ ను హీరో చేసే ప్రయత్నాల్లో ఉన్నాడట. ఒకవేళ ఈ కుర్రాడు హీరోగా మారితే.. జూనియర్ మహేష్ బాబు అనిపించుకోవడం ఖాయమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటివరకు ఘట్టమనేని కుటుంబంలో కాబోయే హీరోలు అని చెప్పుకోనేవారు.. గౌతమ్, రమేష్ బాబు కొడుకు జయకృష్ణ.. చరిత్ మానస్.. ఈ ముగ్గురిలో మాత్రం చరిత్.. మహేష్ బాబును దింపేశాడు అని అభిమానులు అంటున్నారు. మరి ఈ కుర్రాడు మేనమామలా ఎదుగుతాడో లేదో చూడాలి.