Site icon NTV Telugu

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పై ఛార్జ్ షీట్ ఫైల్.. ?

sai dharamtej

sai dharamtej

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలతో బయటపడిన తేజ్ ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇకపోతే ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ కి పోలీసులు నోటీసులు పంపారు. ఏ నోటీసులపై ఇప్పటివరకు తేజు స్పందించలేదని, అందుకే అతనిపై త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

https://ntvtelugu.com/pushpa-the-rise-massive-directors-party/

ప్రమాదం జరిగినప్పుడే కేసు నమోదు చేశామని, అందువల్ల లైసెన్స్, బైక్ ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేశామని తెలిపారు. కానీ, తేజు ఆ నోటీసులకు స్పందించలేదని, అందుకే అతనిపై త్వరలోనే ఛార్జ్ షీట్ ని దాఖలు చేయనున్నట్లు తెలిపారు. మరి ఈ విషయమై మెగా మేనల్లుడు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Exit mobile version