NTV Telugu Site icon

Ram Charan: ప్రధాని మోడీతో చరణ్.. ఇది కదా మనకు కావాల్సిన మూమెంట్

Charan

Charan

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం, అందుకోసం వెళ్లిన చరణ్ పైనే హాలీవుడ్ కన్ను ఉండడం తెలిసిందే. త్వరలోనే చరణ్ ఓ హాలీవుడ్ మూవీలో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంతో పాటే చరణ్ దంపతులు అమెరికాలోనే ఉన్నారు. ఇప్పటికే చరణ్ ఖాతాలో ఎన్నో అవార్డులు, రివార్డులు, అరుదైన రికార్డులు వచ్చి చేరిన విషయం విదితమే. ఇక తాజగా మరో అరుదైన ఘనతను చరణ్ అందుకోబోతున్నాడు. అదేంటంటే.. మరో రెండు రోజుల్లో జరగబోతున్న ఇండియా టుడే కాంప్లెక్స్ సమ్మిట్ లో పాల్గొనడానికి రామ్ చరణ్ కు ఆహ్వానం అందిందట. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశంలోని అనేక ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు. అలాంటి వేదికపై ఒక హీరో పాల్గొనడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఆ అరుదైన ఘనతను చరణ్ దక్కించుకున్నాడు.

Nani: దసరాను కెజిఎఫ్ తో పోల్చినవారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాని

మార్చి 17, 18 తేదీలో జరగనున్న ఈ సమ్మిట్ లో చరణ్ పాల్గొనడమే కాదు స్పీచ్ కూడా ఇవ్వనున్నాడట. ఇకపోతే ఈ వేదికపై ప్రధాని మోడీ, సచిన్ టెండూల్కర్, దేశ మంత్రులు అందరూ ఉండనున్నారు. ఇక ఇది ఒక్కటే కాదు హిందుస్థాన్ టైమ్స్ అనే మరో మీడియా సంస్థ నిర్వహించబోతున్న లీడర్ షిప్ సమ్మిట్ లో కూడా చరణ్ పాల్గొననున్నాడట. దీంతో చరణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇది కదా మాకు కావాల్సిన మూమెంట్.. ప్రధానితో పాటు మా హీరో సమ్మిట్ లో పాల్గొంటున్నాడు.. అది చరణ్ రేంజ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి అమెరికాలో ఉన్న చరణ్ ఈ సమ్మిట్ కోసం రేపు ఇండియా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్.