NTV Telugu Site icon

Upasana: బేబీ బంప్ తో ఉపాసన.. పుట్టబోయే బిడ్డ గురించి చరణ్ ఏమన్నాడంటే

Upasana

Upasana

Upasana: ఉపాసన కొణిదెల.. మెగా కోడలు. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. గోల్డెన్ స్పూన్ తో పుట్టినా.. తన కాళ్ళ మీద తాను నిలబడడానికి ఉపాసన చేసిన ప్రయత్నాలు మామూలువి కాదు. తాతగారి అపోలో బాధ్యతలు తీసుకున్నా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని సక్సెస్ ఫుల్ బిజినెస్ విమెన్ గా కొనసాగుతోంది. ఇక మరోపక్క మెగా కోడలిగా.. చరణ్ కు ఫ్రెండ్ గా, భార్యగా తోడు ఉంటుంది. పదేళ్ల తరువాత ఈ జంట తల్లిదండ్రులు కానున్నారు. ఈ విషయం తెలియడంతో వారు ఎంత ఆనందించారో తెలియదు కానీ మెగా అభిమానులు అయితే పెద్ద పండుగనే చేశారు. ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయ్యాకా.. ఒక్క నిమిషం కూడా వదలడం లేదు చరణ్. ఆమెకు ఏది కావాలంటే అది చిటికెలో తీసుకొచ్చి పెడుతున్నాడు. ఈ విషయాన్నీ రోజూ ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా తెలుపుతూనే ఉంది.

Anjali: చరణ్ సినిమా తరువాత అంజలి పెళ్లి..?

ఇక నిన్న జరిగిన ఆస్కార్ వెంత్ లో మిస్టర్ అండ్ మిసెస్ రామ్ చరణ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఉపాసన అచ్చతెలుగు ఆడపడుచుల చీరలో కనిపించి మెరిపించింది. ఇక చీరలో ఆమె తన బేబీ బంప్ ను ఎంత దాచాలని ప్రయత్నించినా ఫోటోలలో కనిపించేస్తూనే ఉంది. ఆస్కార్ అందుకున్నాక వీరి ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆస్కార్ వేడుకలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో చరణ్ తనకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పుకొచ్చి ఆశ్చర్యపరిచాడు. ” ప్రస్తుతం ఉపాసనకు ఆరోనెల. బిడ్డకు మేము ఎంతో ప్రేమను అందిస్తున్నాం.మా బిడ్డ కడుపులో ఉండగానే మాకు ఎంతో అదృష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది.. తనకోసం మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అంటే మరో మూడు నెలల్లో మెగా వారసుడు రాబోతున్నాడు అని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Show comments