NTV Telugu Site icon

RC 16 : బూత్ బంగ్లాలో చరణ్ – బుచ్చిబాబు షూటింగ్

Rc16 (2)

Rc16 (2)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం RC16. ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాలు చరణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చరణ్ గత సినిమా గేమ్ ఛేంజర్ తాలూకు చేదు అనుభవాన్ని ఈ సినిమా తీరుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అటు చరణ్ కూడా ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కసిగా వర్క్ చేస్తున్నాడు.

Also Read : Janhvi Kapoor : జలజల పాతంలా ‘జాన్వీ కపూర్’ లేటెస్ట్ పిక్స్

ఈ నేపధ్యంలో ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. రానున్నఆగస్టు లోగా షూటింగ్ ఫినిష్ చేయాలని పక్కాగా షెడ్యూల్ ప్లాన్ చేశారట మేకర్స్. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన యూనిట్ తిరిగి మరల వర్క్ స్టార్ట్ చేసారు. హైదరాబాద్ లోని భూత్ బంగ్లాలో జరుగుతున్న షూట్ లో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ పాల్గొన్నారు. అలాగే ఈ షెడ్యూల్ లో చిత్ర హీరో రామ్ చరణ్,హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటు సీనియర్ నటీనటులపై సీన్స్ షూట్ చేస్తున్నారు. సినిమాలోని కీలకమైన క్రికెట్ మ్యాచ్ కు సంబందించిన షాట్స్, పలు యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ప్రైజ్ డిస్టిబ్యూషన్ వంటి ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తో పాటు వృద్ధి సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.