Site icon NTV Telugu

Unstoppable With NBK : ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన బాలయ్య.. అయినా తగ్గని బాబు

Unstoppable Nbk

Unstoppable Nbk

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహా అన్ స్టాపబుల్ నాలుగో సీజన్‌లో మొదటి ఎపిసోడ్ గెస్టుగా వచ్చారు. ఈ షోలో తన బావమరిది నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఇప్పటికే వదిలిన గ్లింప్స్, ప్రోమో అదిరిపోయాయి. ఇక ఈ సుదీర్ఘంగా జరిగిన ఈ ఎపిసోడ్‌లో అనేక ప్రశ్నలు బాలయ్య సందించారని తెలుస్తోంది. అయితే వాటికి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారట. ఆ ప్రశ్నలు ఎంత కాంట్రవర్సీగా ఉన్నా కూడా సమయస్పూర్తితో సమాధానాలు ఇచ్చారని అంటున్నారు.

Boyapati : బోయపాటి భయపడుతున్నాడా..?

జైలు జీవితం చంద్రబాబునాయుడిలో సీమపౌరుషాన్ని నిద్రలేపిందా? వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కూడా కటకటాలపాలు చేసి కక్ష తీర్చుకోవాలన్న కసి వచ్చిందా? మాజీ సీఎంకు వ్యతిరేకంగా చంద్రబాబు సిద్ధం చేసిన ఫైల్స్‌ ఏంటి? అని బాలయ్య అడిగినట్టు తెలుస్తోంది. అయితే ఏ నిర్ణయం తీసుకోవడంలో నైనా అచితూచి వ్యవహరించే చంద్రబాబు, గత అయిదేళ్ల పరిణామాలు చూసిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులకు దూకుడుగా సమాధానమిస్తారా లేదా ఎప్పటిలాగే వ్యవహరిస్తారా? అని ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. 53 రోజులు చంద్రబాబునాయుడు జైల్లో ఎలా గడిపారు ? సీఎంగా జైళ్లను ఆధునీకరించిన చంద్రబాబు.. ఓ నిందితుడిగా ఆ గదుల్లోనే గడపాల్సి రావడంతో ఎలా ఫిలయ్యారు? రాజమండ్రి జైల్లో VIPగా గడిపారా? భయంతో ఉక్కిరిబిక్కిరిఅయ్యారా? అనే ప్రశ్నలకు కూడా చాలా సమస్ఫూర్తితో ఆయన సమాధానాలు ఇచ్చారని అంటున్నారు.

రాజమండ్రి సెంట్రల్‌ జైలు గోడల మధ్య నుంచి చంద్రబాబునాయుడు చూసిన ప్రపంచం ఎలా ఉంది? చదివిన పత్రికలేంటి? చూసిన టీవీలేంటి? కొత్తగా అలవర్చుకున్న అలవాట్లేంటి? అని బాలయ్య తన బావ చంద్రబాబుని అడగగా ఆయన కూడా తడుముకోకుండా సమాధానం ఇచ్చినట్టు చెబుతున్నారు. టీడీపీ-జనసేన మధ్య పొత్తును పవన్‌కల్యాణ్‌ ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు రాజమండ్రిలోని సెంట్రల్‌ జైలు నాలుగుగోడల మధ్య జరిగిన మంత్రాంగమేంటి? ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ తర్వాత వచ్చిన ప్రకటనా? పవన్‌ ఎమోషన్‌లో తీసుకున్న నిర్ణయమా? అని ప్రశ్నలు సంధించారని అంటున్నారు.

లోకేష్‌, పవన్‌కల్యాణ్‌, బాలయ్య ముగ్గురిలో చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు? అని కూడా అడిగారని దానికి తోడు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణిలలో చంద్రబాబు సపోర్ట్ ఎవరికీ అంటూ చంద్రబాబుని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారట. జూనియర్ ఎన్టీఆర్, అమరావతి ప్రస్తావన సహా అనేక విషయాల గురించి సంధించిన ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు ఎలాంటి సమాధానాలు చెప్పారో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Exit mobile version