Site icon NTV Telugu

College love: ‘రాజమండ్రి రోజ్ మిల్క్’ కోసం చంద్రబోస్ గీతం!

Tollywood

Tollywood

Chandra Bose song for ‘Rajahmundry Rose Milk’!

జై జాస్తి, అనంతిక, జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రాజమండ్రి రోజ్ మిల్క్’. ‘వెన్నెల’ కిషోర్, ప్రవీణ్, ప్రణీత్ పట్నాయక్ ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నాని బండ్రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి ఇంట్రూప్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి. సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్రం బృందం తాజాగా ఈ మూవీ టైటిల్‌సాంగ్‌ను సోమవారం విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్మాత ప్రదీప్ ఉప్పలపాటి మాట్లాడుతూ, ”ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రచించిన ‘నువ్వే ముద్దుగా నవ్వే నవ్వగా.. ఉండే నిండుగా.. ఫస్ట్‌డే ఫస్ట్ షో చూసినట్టుగా’ అనే సాంగ్‌ను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అజయ్ అరసాడ సంగీత బాణీలు అందించిన పాటను విడుదల చేశాం. పాటకు అందరి నుంచి మంచి స్పందన వస్తోంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను జ్ఞప్తికి తెస్తుంది” అని అన్నారు. ఈ చిత్రానికి గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్ సంగీతాన్ని సమకూర్చగా, పాటలకు సాహిత్యాన్ని చంద్రబోస్, అనంత్‌ శ్రీరామ్, శ్రీమణి అందించారు.

 

Exit mobile version