Site icon NTV Telugu

Zareen Khan: హాస్పిటల్ పాలైన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే?

Zareen Khan Hospitalized

Zareen Khan Hospitalized

Actress Zareen Khan Hospitalized: మొదటి సినిమానే సల్మాన్ ఖాన్ తో చేసి స్టార్ స్టేటస్ సంపాదించింది నటి జరీన్ ఖాన్. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదు, దీంతో ఆసుపత్రిలో చేరింది. జరీన్ ఖాన్ కి డెంగ్యూ వచ్చిందని, ఆమె తీవ్ర జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులతో బాధపడుతోందని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని జరీన్ ఖాన్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. జరీన్ ఖాన్ ఇంతకుముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టేటస్ పోస్ట్ చేసింది, అందులో ఆమె చేతికి సెలైన్ డ్రిప్ కనిపించింది. అయితే, ఆ తర్వాత ఆ స్టేటస్ ను ఆమె తొలగించింది. ఈ క్రమంలోనే ఆమె మరొక స్టేటస్ ను షేర్ చేయగా అందులో ఒక గ్లాసు రసం కనిపిస్తుంది. జరీన్ ఈ ఫోటోతో ‘రికవరీ మోడ్’లో ఉన్నానని చెప్పుకొచ్చింది. నటి జరీన్ ఖాన్ అనేక సినిమాల్లో నటించారు.

Tovino Thomas: ఇక భరించలేను బాబోయ్.. ట్రోల్స్ పై పోలీసులకు కంప్లైంట్ చేసిన టోవినో

చాలా సినిమాల్లో ఆమె హీరోయిన్ గా కూడా నటించారు. ఆమె హేట్ స్టోరీ 3, వీర్, వజా తుమ్ హో వంటి అనేక హిందీ సినిమాల్లో నటించింది. ఆమె పంజాబీ, తమిళ సహా తెలుగు సినిమాల్లో కూడా నటించినది. ఆమె తెలుగులో గోపీచంద్ హీరోగా నటించిన చాణక్య సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. ఇక ఆమె జూనియర్ కత్రినా కైఫ్ అని పిలుస్తారు. హిందీ సినిమాల్లో ఆమ్ చాలా త్వరగా పేరు తెచ్చుకోవడానికి ఇదే కారణం అని అంటారు. ఇక హాస్పిటల్ పాలైన జరీన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి కూడా చేసింది. డెంగ్యూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులకు ఆమె విజ్ఞప్తి చేసింది. దోమలు లేని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, క్రిమి సంహారక మందులు వాడాలని ఆమె కోరారు.

Exit mobile version