NTV Telugu Site icon

Big Ben Cinemas: చైతన్యరావ్ మూవీ షూటింగ్ పూర్తి!

Chaitanya Rao Film

Chaitanya Rao Film

Chaitanya Rao Movie shooting Completed: ‘పెళ్ళిచూపులు’ చిత్ర నిర్మాత్లలో ఒకరైన యష్ రంగినేని, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న 6వ చిత్రం షూటింగ్ జూలై 29న మొదలైంది. అది ‘పెళ్ళిచూపులు’ మూవీ విడుదలైన తేదీ. ఇక ఆగస్ట్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి, ఇప్పుడు పూర్తి చేసేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత యష్‌ రంగినేని తెలిపారు. చైతన్యరావ్, లావణ్య జంటగా నటించిన ఈ సినిమాను ‘ఓ పిట్టకథ’ ఫేమ్ చందు ముద్దు డైరెక్ట్ చేశాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంలో దాదాపు అంతా కొత్తవాళ్ళే నటించారని, అవుట్ పుట్ చాలా బాగా వచ్చింద’ని చెప్పారు. దర్శకుడు చందు మాట్లాడుతూ, ”ఒక కొత్త తరహాలో, ప్రయోగాత్మక పద్ధతిలో ఈ సినిమా మేకింగ్, లొకేషన్స్ ఉండేలా ప్లాన్ చేశాం. మేం అనుకున్న విధంగానే దీనిని పూర్తి చేశం. ఒక హిట్ సినిమాను మా నిర్మాత యష్ గారికి ఇవ్వబోతున్నాం” అని అన్నారు. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని సమకూర్చగా, పంకజ్ తొట్టాడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.