Central Board Of Film Certification Gives Shock To Pathaan Movie: ఏ ముహూర్తాన ‘బేషరమ్ రంగ్’ పాట విడుదలయ్యిందో తెలీదు కానీ.. అప్పటినుంచి పఠాన్ సినిమాకు కష్టాలు తప్పట్లేదు. అందులో దీపికా పదుకొణె వేసుకున్న కాషాయ రంగు బికినీపై.. హిందూ సంఘాలతో పాటు రాజకీయ నాయకులు సైతం తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని.. దాన్ని సినిమా నుంచి తొలగించాలని ఆందోళనలు చేపట్టారు. లేకపోతే సినిమానే బ్యాన్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకరైతే.. షారుఖ్ ఖాన్‌ని ఏకంగా పాకిస్తాని ఉగ్రవాది అని ముద్ర వేశారు. ఇప్పటికీ ఆ పాటపై నానా రాద్ధాంతం జరుగుతూనే ఉంది.
China Covid: ఆ నగరంలో 70% మందికి కొవిడ్.. వాస్తవ లెక్కలు చెప్పాలన్న WHO
ఈ వ్యవహారమే పఠాన్ సినిమా యూనిట్‌కి పెద్ద తలనొప్పిగా మారగా.. ఇప్పుడు లేటెస్ట్‌గా ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్’ (సీబీఎఫ్‌సీ) మరో ఝలక్ ఇచ్చిందని సమాచారం. బేషరమ్ పాటపై చెలరేగిన వివాదం దృష్ట్యా.. సినిమాలో కొన్ని మార్పులు సూచించిందట! ఏ విషయంపై అయితే ఆ పాటపై వివాదం రేగిందో, ఆ కాషాయం రంగుని మార్చాల్సిందిగా పేర్కొందట! అలాంటివే మరికొన్ని మార్పుల్ని సూచించినట్లు సమాచారం. అంతేకాదు.. పఠాన్ టైటిల్‌ని సైతం మార్చాలని ఆ బోర్డు కండిషన్ పెట్టిందట! లేకపోతే.. సినిమా విడుదలయ్యాక వివాదాలు రాజుకోవచ్చని బోర్డు అభిప్రాయపడినట్లు వార్తలొస్తున్నాయి. అయితే.. బోర్డు ఈ సూచనల్ని జారీ చేసినట్లు అధికారిక స్పష్టత అయితే లేదు.
Waltair Veerayya: ఆ టైంలో ఇబ్బంది పడ్డా.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్
తనని తాను గొప్ప క్రిటిక్‌గా చెప్పుకునే కమాల్ ఆర్ ఖాన్.. ఈ విషయంపై ట్వీట్ చేసినప్పటి నుంచే ‘పఠాన్’ మార్పుల గురించి వార్తలు జోరుగా వస్తున్నాయి. పఠాన్ టైటిల్‌తో పాటు కాషాయం రంగు దుస్తుల్ని మార్చాల్సిందిగా పఠాన్ యూనిట్‌కి సూచనలు అందాయని.. ఈ నేపథ్యంలోనే వాళ్లు సినిమాని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారని కేఆర్కే పేర్కొన్నాడు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని పేర్కొన్నాడు. సాధారణంగా.. ఇలాంటి వివాదాస్పదన అంశాల గురించి గతంలో కేఆర్కే చెప్పినప్పుడు నిజం అయ్యాయి. కాబట్టి, ఈసారి కూడా అతని మాట నిజం అవ్వొచ్చని అంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ!
Japan Offer: టోక్యోని వీడండి.. లక్షలు కొట్టేయండి.. జపాన్ ప్రభుత్వం ఆఫర్