Site icon NTV Telugu

Shane Warne Demise : క్రికెట్ లెజెండ్ కు సెలెబ్రిటీల నివాళి

Shane-Warne

దిగ్గజ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 52 ఏళ్ళ వయసులోనే ఆయనను కోల్పోవడం పట్ల క్రికెట్ ప్రపంచంతో పాటు సెలెబ్రిటీలు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ 1999 ప్రపంచ కప్‌ను గెలవడంలో భాగమయ్యాడు. షేన్ వార్న్ గొప్ప లెగ్ స్పిన్నర్‌లలో ఒకరు. ఆయన క్రికెట్ కెరీర్ లో 708 టెస్ట్ మ్యాచ్ వికెట్లు ఉన్నాయి. ఈ రికార్డును శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ అధిగమించాడు. షేన్ వార్న్ మృతి క్రికెట్‌ ప్రపంచానికి తీరని లోటు. ఈ ప్రముఖ ఆటగాడి ఆకస్మిక మృతితో క్రికెట్ సోదరులే కాదు, దక్షిణాదికి చెందిన ప్రముఖులు కూడా షాక్‌ కు గురయ్యారు.

Read Also : Bigg Boss OTT : మోనాల్ తో అఖిల్ రిలేషన్… లవ్ కాదంటూనే…

మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేన్ వార్న్ చిత్రాన్ని పంచుకుంటూ “ఈ వార్తతో షాక్ అయ్యాను, బాధపడ్డాను. ప్రపంచ క్రికెట్‌కు చాలా బాధాకరమైన రోజు. శాంతితో విశ్రాంతి తీసుకోండి” అంటూ రాసుకొచ్చారు. ఇక సమంత, రకుల్ ప్రీత్ సింగ్, నాని, విఘ్నేష్ శివన్ తో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా క్రికెట్ లెజెండ్‌కు నివాళులర్పించారు . రణ్‌వీర్ సింగ్, అనన్య పాండే, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, హుమా ఖురేషి, సన్నీ డియోల్ తదితరులు షేన్ వార్న్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

Exit mobile version