VD 14: విజయ్ దేవరకొండ సినిమాకి నటీనటులు కావలెను
- కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసిన హీరో విజయ్ దేవరకొండ భారీ పాన్ ఇండియా మూవీ "వీడీ 14" టీమ్
- విజయ్ దేవరకొండ- డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్- మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14
- తిరుపతి-అనంతపురం-కడప-కర్నూల్ లో జూలై 1వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Casting Call Announced for Hero Vijay Deverakonda’s Pan India Movie “VD 14”: ఈ మధ్య కాలంలో రియలిస్టిక్ సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో అలాంటి సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఆయా సినిమాల్లో నటీనటులను కూడా ఆయా సినిమాల నేపధ్యాన్ని బట్టి ఎంచుకుంటున్నారు. కీలక పాత్రధారులను ముందే ఎంచుకుంటున్నా క్యాస్టింగ్ కాల్స్ కూడా వదులుతున్నారు. అందులో భాగంగా విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 కోసం నటీనటులు కావాలంటూ ప్రకటించింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక తాజా ప్రకటన సారాంశం మేరకు ఔత్సాహిక నటీనటులను ఎంపిక చేసి వీడీ 14లో నటించే అవకాశం కల్పించనున్నారు.
Kiraak Boys Khiladi Girls: అనసూయతో జాకెట్‌తో అంత రచ్చ చేయించి.. ఇప్పుడిలా షాక్ ఇచ్చారు ఏంటి?
Also Read
తిరుపతి, అనంతపురం, కడప, కర్నూల్ లో జూలై 1వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ జరగనున్నాయని ప్రకటించారు. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ మొత్తం రాయలసీమలోనే జరగనుంది కాబట్టి నటనలో ప్రతిభ గల కొత్త టాలెంట్ కు ఇది గొప్ప అవకాశం అని చెప్పచ్చు. ఒక వీరుడి పోరాటాన్ని చూపిస్తూ 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాను దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్నారు. ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో సినిమా కావడం, ‘టాక్సీవాలా’ లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్న క్రమంలో సినిమా మీద అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ప్రేక్షకులకు ఒక ఎపిక్ లాంటి ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇవ్వనుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలో వీడీ 14 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!