NTV Telugu Site icon

VD 14: విజయ్ దేవరకొండ సినిమాకి నటీనటులు కావలెను

Vd 14 Casting Call 2

Vd 14 Casting Call 2

Casting Call Announced for Hero Vijay Deverakonda’s Pan India Movie “VD 14”: ఈ మధ్య కాలంలో రియలిస్టిక్ సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో అలాంటి సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఆయా సినిమాల్లో నటీనటులను కూడా ఆయా సినిమాల నేపధ్యాన్ని బట్టి ఎంచుకుంటున్నారు. కీలక పాత్రధారులను ముందే ఎంచుకుంటున్నా క్యాస్టింగ్ కాల్స్ కూడా వదులుతున్నారు. అందులో భాగంగా విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 కోసం నటీనటులు కావాలంటూ ప్రకటించింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక తాజా ప్రకటన సారాంశం మేరకు ఔత్సాహిక నటీనటులను ఎంపిక చేసి వీడీ 14లో నటించే అవకాశం కల్పించనున్నారు.

Kiraak Boys Khiladi Girls: అనసూయతో జాకెట్తో అంత రచ్చ చేయించి.. ఇప్పుడిలా షాక్ ఇచ్చారు ఏంటి?

తిరుపతి, అనంతపురం, కడప, కర్నూల్ లో జూలై 1వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ జరగనున్నాయని ప్రకటించారు. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ మొత్తం రాయలసీమలోనే జరగనుంది కాబట్టి నటనలో ప్రతిభ గల కొత్త టాలెంట్ కు ఇది గొప్ప అ‌వకాశం అని చెప్పచ్చు. ఒక వీరుడి పోరాటాన్ని చూపిస్తూ 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాను దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్నారు. ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో సినిమా కావడం, ‘టాక్సీవాలా’ లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్న క్రమంలో సినిమా మీద అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ప్రేక్షకులకు ఒక ఎపిక్ లాంటి ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇవ్వనుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలో వీడీ 14 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Show comments