Site icon NTV Telugu

Veerasimha Reddy: మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న మంచు లక్ష్మీ!

Bala

Bala

నందమూరి బాలకృష్ణకు సినిమా రంగంలోనూ సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. అవకాశం చిక్కాలే కానీ ‘జై బాలయ్యా’ అంటూ వారు నినదిస్తుంటారు. అందులో మంచు లక్ష్మీ కూడా ఒకరు. గతంలో ‘అఖండ’లోని ‘జై బాలయ్య’ గీతానికి తనదైన రీతితో స్టెప్పులేని సోషల్ మీడియాను షేక్ చేసిన మంచు లక్ష్మీ… తాజాగా ‘వీరసింహారెడ్డి’లోని ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ సాంగ్ సిగ్నేచర్ స్టెప్ కు డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఆ డాన్స్ వీడియోను అప్ లోడ్ చేయడం ఆలస్యం… లైక్స్, రీట్వీట్స్ తో అది దూసుకుపోతోంది. ”Ruling our మనోభావాలు since forever. Can’t wait to see the sankranti mass rampage of #Balayya!” అంటూ ఆమె కామెంట్ పెట్టారు.

బాలయ్య బాబు నుండి మరో ‘అఖండ’ తరహా సినిమా రాబోతోందని, సంక్రాంతి బరిలో బాలయ్య మరోసారి తన సత్తా చాటబోతున్నాడని అభిమానులు భావిస్తున్నారు. రేపటి నుండి ఈ సంక్రాంతి సీజన్ అంతా థియేటర్లు ‘జై బాలయ్య’ నినాదంతో దద్దరిల్లడం ఖాయమనిపిస్తోంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాను మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తనదైన పంథాలో తెరకెక్కిస్తే, దానికి బుర్రా సాయిమాధవ్ మాస్ డైలాగ్స్ అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యిందని ఫ్యాన్స్ అంటున్నారు.

Exit mobile version