Taraka Ratna: ప్రస్తుతం నందమూరి నటవంశానికి పెద్ద దిక్కు అంటే బాలకృష్ణనే! టాలీవుడ్ టాప్ స్టార్ గా సాగడమే కాదు, హిందూపురం ఎమ్మెల్యేగా, బసవరామతారకం కేన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ గానూ బాలకృష్ణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అందువల్ల నందమూరి కుటుంబంలోనూ బాలయ్య మాటకు ఎంతో విలువ ఉంది. ఆయన అన్నదమ్ముల పిల్లలు కూడా బాలయ్య అంటే ఎంతగానో గౌరవిస్తారు. నందమూరి నటవంశంలో తరువాతి తరం హీరోలయిన జూనియర్ యన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్నకు కూడా తమ ‘బాబాయ్’ అంటే ఎంతో అభిమానం. బాలయ్య సినిమాల వేడుకల్లోనూ ఈ హీరోలు పాల్గొంటూ ఉంటారు. ఇక బాలయ్యతో నటించాలని ఈ యంగ్ హీరోస్ ఆశిస్తూనే ఉన్నారు.
Pooja Hegde: ఫ్రంటే కాదు బుట్ట బొమ్మ బ్యాక్ కూడా చూపించి పిచ్చేక్కిస్తోందే
బాలయ్యతో అందరికన్నా ముందుగా కలసి నటించింది కళ్యాణ్ రామ్. అసలు కళ్యాణ్ రామ్ తొలుత తెరపై బాలనటునిగా బాలయ్య ‘బాలగోపాలుడు’ సినిమాతోనే కనిపించారు. ఆ తరువాత యన్టీఆర్ బయోపిక్ గా రూపొందిన ‘కథానాయకుడు, మహానాయకుడు’ చిత్రాల్లోనూ బాలయ్యతో కలసి నటించారు కళ్యాణ్ రామ్. ఇక జూనియర్ యన్టీఆర్ తన ‘ఆది’ సినిమా విజయోత్సవంలోనూ, తరువాత తన బాబాయ్ బాలయ్య చేతుల మీదుగా ఓ అవార్డు అందుకొనే సమయంలోనూ “బాబాయ్ తో కలసి నటించాలని ఉంది” అంటూ అభిలాష వ్యక్తం చేశారు. ఇక తారకరత్న సినిమా రంగంలో అడుగు పెట్టిన దగ్గర నుంచీ తన బాబాయ్ తో నటించే రోజు రావాలనే ఆశిస్తూ వచ్చారు. అలాగే బాబాయ్ బాలయ్య పోటీ చేసిన హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన తరపున ప్రచారం కూడా నిర్వహించారు తారకరత్న. తన అన్న కళ్యాణ్ రామ్, బాబాయ్ తో కలసి నటించేశారని, ఈ సారి ఆ వంతు తనకు వస్తుందని తారకరత్న అనేవారు.
Mouni Roy: అందాల నాగిని.. అందాలను వర్ణించతరమా
తారకరత్న అభిలాష త్వరలోనే నెరవేరనుందని ఇప్పుడు విశేషంగా వినిపిస్తోంది. తారకరత్న అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ‘బాబాయ్ తో కలసి తారకరత్న నటిస్తారు’ అన్న అంశం వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించబోయే కొత్త చిత్రంలో తారకరత్న విలన్ గా నటిస్తాడని కొందరు, లేదు కీలక పాత్ర పోషించనున్నారని మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా బాలకృష్ణతో కలసి తారకరత్న నటిస్తారని తెలుస్తోంది. తారకరత్న కోలుకోవాలని అభిమానులు, కుటుంబసభ్యులు కోరుకుంటున్నారు. అలాగే బాబాయ్ తో కలసి నటించాలన్న తారకరత్న కోరిక కూడా నిజం కావాలని వీరందరూ ఆశిస్తున్నారు. అది త్వరలోనే సాకారం అవుతుందేమో చూద్దాం.