BVSN Prasad: గోదావరి జిల్లాల జనసేన టికెట్ రేసులో బడా టాలీవుడ్ ప్రొడ్యూసర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BVSN Prasad Seeks Janasena Ticket in Godavari Districts: పొత్తుల సంగతి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 2024 ఎన్నికలకు జనసేన అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. మొన్నటి వరకు సీఎం అవ్వడం కుదురుతుందా? లేదా? అనే మీమాంసలో ఉన్న పవన్ ఇప్పుడు కాబోయే సీఎం తానే అన్నట్టు మాట్లాడుతూ తన పార్టీ శ్రేణులలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాలు పక్కన పెట్టేసిన పవన్ వారాహి యాత్రలో ఉన్నారు. గోదావరి జిల్లాల్లో ఆయన చేపట్టిన వారాహి యాత్ర కొనసాగుతోంది. అయితే గత ఎన్నికల సమయంలో పవన్ వెంట నడించేందుకు పెద్దగా టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రయత్నించలేదు కానీ ఈసారి ఎందుకో ఆయనతో కలిసి నడిచే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ మంగళగిరి కార్యాలయానికి వెళ్లిన ఆయన ప్రస్తుత సినిమాల దర్శక నిర్మాతలు వారాహి యాత్రకు సంఘీభావం తెలిపారు. మరోపక్క టాలీవుడ్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ అయితే ఏకంగా జనసేన కండువా కప్పేసుకున్నారు కూడా.
Rana Daggubati: పాన్ ఇండియా సినిమాలో రానా.. సైలెంట్ గా కానిచ్చేశారు!
ఇక టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు గోదావరి జిల్లాల నుంచి భోగవల్లి ప్రసాద్ జనసేన టిక్కెట్ ఆశిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. పశ్చిమ గోదావరికి చెందిన భోగవల్లి ప్రసాద్ చాలా కాలం నుంచే టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా ఉన్నాడు. 1986లో డ్రైవర్ బాబు సినిమాతో నిర్మాతగా మారిన ఆయన ఛత్రపతి, మగధీర, అత్తారింటికి దారేది ఇటీవలి విరూపాక్ష లాంటి హిట్ సినిమాలు అందుకున్నాడు. ఇప్పటికే తన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాణ సంస్థ బాధ్యతలను తన కుమారుడు భోగవల్లి బాపినీడుకు అలవాటు చేసిన ఆయన జనసేన టిక్కెట్‌పై పోటీ చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే అయినా అది ఎంతవరకు నిజం అవుతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక నిజానికి లెక్క ప్రకారం అయితే ఎన్నికలు ఇంకా 10 నెలలలో జరుగుతాయి అంటే ఆలోపు ఈ వార్తలు నిజమా? లేక ఒట్టి ప్రచారమేనా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!