Butta Bomma: ఒక తండ్రి తన కూతురితో చూడాల్సిన సినిమా: శౌరి చంద్రశేఖర్ రమేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryadevara Nagavamsi: ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘బుట్ట బొమ్మ’. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సాయి సౌజన్య భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. అనికా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ శనివారం జనం ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ, ”మా సినిమాకు చక్కని స్పందన లభిస్తోంది. ఇంతమంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. సినిమా బాగుందని యూఎస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఇది లవ్ స్టోరీ నుంచి థ్రిల్లర్ గా మారే కథ అయినప్పటికీ, కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా. మీ కుటుంబంతో కలిసి వెళ్ళండి. ఈ చిత్రం మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. ముఖ్యంగా ఒక తండ్రి తన కూతురితో కలిసి చూడాల్సిన సినిమా. మనం పిల్లలతో చెప్పలేని కొన్ని విషయాలను ఈ సినిమా చూపించి వారికి సులభంగా అర్థమయ్యేలా చేయొచ్చు. థియేటర్ కి వెళ్లి చూడండి. ఒక మంచి సినిమా చూశామనే తృప్తి మీకు కలుగుతుంది. రోజురోజుకి ఈ సినిమా మరింత ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం” అన్నారు.
Also Read
- Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
- Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
- Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
- Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
నటుడు అర్జున్ దాస్ మాట్లాడుతూ, “అందరికీ మా సినిమా నచ్చిందని అనుకుంటున్నాను. ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. సినిమాలో నా నటన, డబ్బింగ్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సినిమాకి, సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వస్తుండటం ఆనందంగా ఉంది” అన్నారు. మరో నటుడు సూర్య వశిష్ఠ మాట్లాడుతూ.. “ఈరోజు ఉదయం మేం ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాం. ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా మీద మేం పెట్టుకున్న నమ్మకం నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూసి, మమ్మల్ని ఆదరించండి” అన్నారు. కథానాయిక అనికా సురేంద్రన్ మాట్లాడుతూ.. “మేం ఎంతో ఇష్టపడి చేసిన మా ‘బుట్టబొమ్మ’ సినిమాకు ఇంతమంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు” అని అన్నారు. మాటల రచయిత గణేష్ రావూరి మాట్లాడుతూ, “బుట్టబొమ్మ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేం ఊహించినట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కథలో ఉన్న మలుపులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ చిత్రం ద్వారా ఇచ్చిన సందేశాన్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. సినిమాకి వస్తున్న స్పందన పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం” అని చెప్పారు.
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!