ప్రియదర్శి హీరోగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక హీరోయిన్‌గా ‘మిత్రమండలి’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని బన్నీ వాసు స్వతంత్ర నిర్మాతగా తొలిసారిగా నిర్మిస్తున్నారు. తన స్నేహితులతో కలిసి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ వాసు మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ మీద టార్గెట్ చేసి నెగెటివ్ కామెంట్స్ పెట్టించారని అన్నారు. ఈ విషయం మీద ఇప్పటికే సైబర్ క్రైమ్‌కి కూడా కంప్లైంట్ ఇచ్చారు.
Also Read : Ilaiyaraaja : ఇళయరాజా స్టూడియోపై బాంబ్ బెదిరింపు – పోలీసులు అప్రమత్తం
సైబర్ క్రైమ్ నుంచి బయటకు వచ్చిన సమాచారం మేరకు, ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ మీద ఒకే ఐపీ అడ్రస్ మీద 300 ఐడీల నుంచి కామెంట్స్ పెట్టించారని తెలిసినట్లుగా సమాచారం. ఈ నేపధ్యంలో బన్నీ వాసు ఈరోజు మధ్యాహ్నం మీడియా ముందుకు రాబోతున్నారు. ఒక సెన్సేషనల్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్లుగా సినిమా టీం నుంచి మీడియాకు సమాచారం అందింది. తాజాగా అందుతున్న సమాచారం ఏమిటంటే, ఈ దీపావళికి రిలీజ్ అవుతున్న మరో మూడు సినిమాల్లో ఒక సినిమాకి సంబంధించిన డిజిటల్ టీం ఈ పని చేయించిందని. ఇదే విషయాన్ని బన్నీ వాసు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాకి వివరాలు అందించబోతున్నట్లుగా సమాచారం. అయితే, ఇప్పటివరకు ఇది ప్రచారమే కాగా, ప్రెస్ మీట్ తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.
