Site icon NTV Telugu

Bunny Vas : పవన్ ఇరిటేట్.. ఇండస్ట్రీ సరిగా లేదు.. బన్నీ వాస్ కామెంట్స్

Bunny Vasu News

Bunny Vasu News

Bunny Vas : ఇప్పుడు థియేటర్ల బంద్ పై పెద్ద రచ్చనే జరుగుతోంది. థియేటర్ల బంద్ ఉండదని నిర్మాతల మండలి ప్రకటించినా సరే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చేసిన ప్రకటనతో నిప్పు రాజుకున్నట్టే అయింది. సినిమా ఇండస్ట్రీపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని.. స్వీకరిస్తానని చెప్పడంతో తీవ్ర కలకలం మొదలైంది. ఈ క్రమంలోనే నిర్మాత బన్నీ వాసు సంచలన ట్వీట్ చేశారు. టాలీవుడ్ లో చాలా రాజకీయాలు ఉన్నాయని.. కాకపోతే అవి బయటకు కనిపించకుండా లోతుగా ఉంటాయని చెప్పారు. ఇప్పటికే ఈ రకమైన రాజకీయా రొచ్చులో టాలీవుడ్ నలిగిపోతోందంటూ తెలిపారు.

Read Also : Andhra King Taluka: ఆంధ్రా కింగ్ బరిలోకి దిగాడు!

ఈ విషయాలను ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గ్రహించాలన్నారు. మన ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి వెళ్లి డిప్యూటీ సీఎం అయితే అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే మనలో యూనిటీ ఏ స్థాయిలో ఉందో ప్రశ్నించుకునే టైమ్ వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ అసహనంపై ఆయన ఈ విధంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ చేసిన ప్రకటనతో టాలీవుడ్ లో తీవ్రమైన చర్చలు మొదలయ్యాయి. వరుసగా ఒక్కొక్కరు స్పందించేందుకు ముందుకు వస్తున్నారు. ఇండస్ట్రీలో ఐక్యత కరువైందనే విషయాన్ని పవన్ కూడా స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే.

Read Also : Jailer 2 : జైలర్-2లో ఆ కాంట్రవర్సీ యాక్టర్..?

Exit mobile version