Site icon NTV Telugu

Ram Charan: స్వీట్ బ్రదర్ అంటూ చరణ్ కి బన్నీ స్వీటెస్ట్‌ రిప్లై.. ఎన్టీఆర్ ని బావ అంటూ..

Ramcharan

Ramcharan

Ram Charan: మెగా-అల్లు కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ వృక్షాన్ని పట్టుకొనే అల్లు అర్జున్ ఇక్కడివరకు వచ్చాడని అంటుంటారు. అయితే ఇప్పుడు బన్నీ కూడా మెగా కుటుంబంతో కలవడంలేదని టాక్. కానీ, వీరి మధ్య విబేధాలను అల్లు అరవింద్, చిరంజీవి ఖండిస్తూ వస్తున్నా.. అల్లు అర్జున్ వలన అవి ఎప్పటికప్పుడు బయట పడుతూనే వస్తున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. సాధారణంగా అల్లు అర్జున్.. సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటాడు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కానీ, చిన్న హీరో, పెద్ద హీరో అని బేధం లేకుండా వారిని సోషల్ మీడియాలో విష్ చేస్తూ ఉంటాడు. అయితే అంతగా అందరి పుట్టినరోజులకు విష్ చేసే బన్నీ.. రామ్ చరణ్ బర్త్ డే కు విష్ చేయలేదు.. అయినా అవన్నీ పక్కన పెట్టిన చరణ్.. బన్నీ బర్త్ డేకి ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్ డే బన్నీ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు వీరి ఇద్దరి కుటుంబంలో విభేదాలు అంటూ వస్తున్న వార్తలకు చరణ్, బన్నీ చెక్ పెట్టారు.

Read also: Drunk and Drive: ఓరేయ్ ఆజాము లగెత్తండ్రోయ్.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు

నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు.. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా బన్నీకి విషెస్ చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా చరణ్ కూడా బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పాడు. బన్నీ బర్త్ డే గుర్తుపెట్టుకొని చరణ్ స్వీట్ గా విష్ చేయగా… బన్నీ మురిసి పోతూ చరణ్ కు థ్యాంక్యూ మై స్వీట్ బ్రదర్ అంటూ స్వీటెస్టుగా రిప్లై ఇవ్వడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ముందు బన్నీకి చరణ్ విష్ చేయగా.. తరువాత ఎన్టీఆర్ ట్విటర్ వేదికగా విష్ చేశారు. అయితే ఫస్ట్ చెప్పిన చరణ్ కి కాకుండా సెకెండ్ చెప్పిన ఎన్టీఆర్ కు బన్నీ థాంక్స్ బావా అని రిప్లై ఇవ్వడంతో అభిమానుల్లో నిజంగానే వీరి కుటుంబాల మధ్య విభేధాలు వున్నాయని వార్తలు గుప్పు మన్నారు. అయితే దీనిని చెక్ పెడుతూ బన్నీ.. చరణ్ కు చేసిన విషష్ కు లేట్ గా బదులు ఇచ్చిన లేటెస్ట్ గా అనిపించింది. థాంక్స్ మై స్వీట్ బ్రదర్ అంటూ రిప్లై ఇవ్వడంతో.. మెగా- అల్లు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version