Site icon NTV Telugu

Rashmi Gautam: ‘భోళా శంకర్’లో కర్చీఫ్ తీసేలోపే వెళ్లిపోయావ్.. పాపం రష్మి పరువు తీసేశాడుగా!

Rashmi

Rashmi

Bullet Bhaskar Punch on Rashmi Gautam: ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో యాంకర్ రష్మీ ఒక చిన్న పాత్రలో, ఒక పాటలో కనిపించి కనువిందు చేసింది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా ఆమె కనిపించినంత సేపు అందాలు ఆరబోసింది. ఇక ఆమె పాత్ర గురించి తాజా ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో బుల్లెట్ భాస్కర్ పంచ్ వేసి ఆమె పరువు తీసి పారేశాడు. సెప్టెంబర్ 15న ప్రసారం కాబోతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల కాగా ‘‘చిరంజీవి సినిమాలో నువ్వు చేసావు’’ అని రష్మితో చెబుతూ.. “నీకోసం సినిమా థియేటర్‌కు వెళ్తే ఇంటర్వెల్ వరకు కనబడలేదని బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చారు.

Mukesh Udeshi: సినీపరిశ్రమలో తీవ్ర విషాదం.. చిరంజీవి సినిమాల నిర్మాత మృతి!

అయితే ఇంటర్వెల్ తర్వాత వస్తావు కదా అని థియేటర్లో వెయిట్ చేస్తే కింద కర్చీఫ్ పడింది, వంగుని ఇలా తీసేలోపే మళ్ళీ వెళ్ళిపోయావు అంటూ రష్మీ మీద పంచ్ వేసి పాపం పరువు తీసి పారేశారు. ఇక కేవలం బులెట్ భాస్కర్ అనే కాక ఇమ్మాన్యుయేల్-శ్రీవిద్య, బాబు-వర్ష స్కిట్ ప్రోమో కూడా ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత ఆటో రామ్ ప్రసాద్, దొరబాబు స్కిట్ ప్రోమో సైతం ఇంట్రెస్టింగ్ గా సరదాగా సాగింది. ప్రోమోని బట్టి చూస్తే రాబోయే ఎపిసోడ్లో ఇమాన్యుల్, బుల్లెట్ భాస్కర్, రాంప్రసాద్ స్కిట్స్ హైలెట్ గా ఉండబోతున్నాయని అర్థం అవుతోంది.

Exit mobile version